ప్రశాంత్ కిషోర్ సేవలు కేసీఆర్ కు కలిసివస్తాయా ?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎప్పుడూ డబ్బు కోసం పని చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రశాంత్ గత కొన్నేళ్లుగా తన స్నేహితుడని, కలిసి దేశం కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్. ప్రశాంత్‌తో కలిసి టీఆర్‌ఎస్ పనిచేస్తుందన్న రహస్యం లేదన్నారు. దేశం కోసం ప్రశాంత్‌కు ఉన్న నిబద్ధత మీకు తెలియదని కేసీఆర్ అన్నారు. ప్రశాంత్ మమత, కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్. తెలంగాణ కు ఆప్ స్వాగతం, వారిని రండి ఇదే ప్రజాస్వామ్యమని కేసీఆర్ అన్నారు. అంతకుముందు ప్రశాంత్ ప్రకాష్ రాజ్‌తో కలిసి కొన్ని ప్రాజెక్టులను సందర్శించినట్లు మీడియా ద్వారా నివేదించబడింది. అయితే ప్రశాంత్ రాజకీయ పార్టీలతో కలిసి పనికి వందల కోట్లు వసూలు చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో గత ఎన్నికల్లో ప్రశాంత్ చెప్పిన ఫీజుకు చంద్రబాబు అంగీకరించకపోవడంతో జగన్ వద్దకు ప్రశాంత్ వెళ్లాల్సి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రశాంత్‌కు జాతీయ స్థాయి కమిట్‌మెంట్ లేదని, పార్టీలు మారుతూ కూలీగా పనిచేస్తున్నాడని ప్రజలు అంటున్నారు. భాజపా కోసం పనిచేసిన నితీష్‌కి మారిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌తో పాటు కేజ్రీవాల్ కోసం కూడా ఆయన పనిచేశారు. ప్రశాంత్ దాదాపు పన్నెండు రాష్ట్రాలకు పనిచేశాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి ప్రశాంత్ కిషోర్ వస్తే.. ఎందుకు అంత భయపడుతున్నారు అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 105 సీట్లను కచ్చితంగా గెలిచి తీరుతామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.