అమరావతి : విజయసాయి స్పీడు పెంచేస్తున్నారా ?

Vijaya



వైసీపీ అనుబంధసంఘాలకు ఇన్చార్జిగా నియమితుడైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన మార్కు చూపించబోతున్నారు. ఎంపీగానే కాకుండా పార్టీలో సీనియర్ నేతగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాంటి ఎంపీకి అనుబంధసంఘాల బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. దాంతో వరసబెట్టి అనుబంధసంఘాల బాధ్యులతో విజయసాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.





రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనదైన మార్కును చూపించాలని డిసైడ్ అయ్యారట. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్ మీడియాది చాలా కీలకపాత్రనే చెప్పాలి. అప్పట్లో సోషల్ మీడియాకు విజయసాయే ఇన్చార్జిగా ఉండేవారు. రెగ్యులర్ గా వాళ్ళతో సమావేశాలు పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం ఎలా జరుగుతోంది ? ఎలా జరగాలనే విషయాలను డైరెక్షన్ చేసేవారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళుదాటింది. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో అసంతృప్తి మొదలైంది.





పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను జగన్ మరచిపోయారనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే విజయసాయి ప్లాన్ చేస్తున్నారు. అదేమిటంటే జాబ్ మేళాలు ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 13 జిల్లాల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేసి అర్హతలున్నవారికి ఆటోమొబైల్, ఈ కామర్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ప్లాన్ చేశారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 25 వేలమందికి ఉద్యోగాలు ఇప్పించబోతున్నారట.





అంటే ప్రైవేటురంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటం వల్ల కుటుంబానికి సదరు యూత్ అండగా నిలవటంతో పాటు పార్టీకి కూడా ఉపయోగపడతారు. పనిలో పనిగా ప్రతి కార్యకర్తకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కేవలం పార్టీ కార్యకర్తల కకోసమే కేంద్ర కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారట. ఇదంతా చూస్తుంటే రాబోయే రెండున్నరేళ్ళలో సోషల్ మీడియాను నూరుశాతం యాక్టివేట్ చేయటానికి వియసాయి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అర్ధమవుతోంది. ఇపుడు మొదలైన ప్రయత్నాలు సక్సెస్ అయితే వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి దొరికితే మంచిదేకదా.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: