తగ్గేదేలే: రష్యాకు మేము లొంగిపోం ?

VAMSI
కొన్ని సార్లు కొన్ని విషయాలు చిన్నవి గానే కనిపిస్తాయి. కానీ అవి మిస్ ఫైర్ అయితే వాటి ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది అన్నదానికి సరైన ఉదాహరణ రష్యా మరియు ఉక్రెయిన్ ల మధ్య గత 15 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం. ఇందులో యుద్దానికి దారి తీసిన ఒక సమస్య ఏమిటంటే... ఉక్రెయిన్ దేశం నాటో కూటమిలో కలవకూడదు అన్నది రష్యా ఆకాంక్ష. అయితే యుద్దానికి ముందు వరకు ఈ విషయంపై ఇద్దరికీ దాదాపుగా 10 రోజులు చర్చలు జరిగాయి. అయితే ఎంతకీ ఉక్రెయిన్ రష్యా మాట వినిపించుకోలేదు. అయితే ఎలాగైనా ఉక్రెయిన్ ను లొంగదీసుకోవడానికి ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి భయబ్రాంతులకు గురి చేసింది.
అయినా ఉక్రెయిన్ వినలేదు. ఇక చేసేదేమీలేక రష్యా యుద్ద భేరి మోగించింది. ఇక అప్పటి నుండి 15 రోజులుగా యుద్ధం మధ్య మధ్యలో కొన్ని గంటల పాటు ఆగడం మినహా జరుగుతూ ఉంది. లక్షల మంది ఇరు దేశాలకు చెందిన సైనికులు బలయ్యారు. ఉక్రెయిన్ లో సామాన్యులు సైతం యుద్దానికి మృత్యు వాత పడ్డారు. అయితే ప్రపంచ దేశాల్లో ఉక్రెయిన్ కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ , బ్రెజిల్ లాంటి దేశాలు మద్దతు ఇస్తున్నాయి. అయితే ఈ దేశాలు కూడా యుద్దాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెబుతున్నా వీరి మాటలను ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా వారినే హెచ్చరిస్తున్నాడు. ఇక స్వయంగా ఉక్రెయిన్ నుండి ప్రజా ప్రతినిధులు వెళ్లి రెండు సార్లు చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయింది.
రష్యా ఎంతసేపటికీ నాటో కూటమిలో చేరము అని అగ్రిమెంట్ లో సంతకం చేస్తేనే యుద్దాన్ని ఆపుతామని కూర్చుంది. ఇక తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యకు ఉక్రెయిన్ ఆత్మవిశ్వాసాన్ని మరియు తమపై ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తోంది. నిన్న సాయంత్రం ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి కులేబా  మాట్లాడుతూ రష్యా కోరుకుంటున్నా విధంగా యుద్ధంలో మేము లొంగిపోయే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు యుద్ధంలో మా బలాన్ని చూపించాను... రష్యా దూకుడు అన్ని విధాలా కళ్లెం వేశాము. రష్యా దాడుల వలన ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు చాలా అవసరం ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రష్యా నే యుద్దాన్ని ఆపాలని కులేబా స్పష్టం చేశారు. మరి ముందు ముందు దీనిపై ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: