నిజాంపేట్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు ?

Veldandi Saikiran
కొనసాగుతున్న కూల్చివేతలు
ప దకొండవ రోజు నిజాంపేట్ మున్సిపాలిటీ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు
ఇప్పటివరకు 101 అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందాలు

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నది. గురువారం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక అపార్ట్ మెంట్ లో ఉన్న రెండు బ్లాక్ లపై అక్రమ అంతస్తుల నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం కూల్చి వేసింది.
నిజాం పేట్ మున్సి పాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 92/పి లో ఒక యజమాని తనకు ఉన్న 840 చదరపు గజాల స్థలంలో  గ్రౌండ్ + 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకు ని మూడు ( 3 ) బ్లాక్ లను స్లిట్ +5 అప్పర్ ఫ్లోర్స్ నిర్మా ణాలు కట్టారు.దాని పై గురు వారం టాస్క్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకుంది.
గత కొన్ని రోజులు గా హెచ్ఎం  డీఏ, టాస్క్ ఫోర్స్ టీమ్స్ పలు మున్సిపాలిటీ ల పరిధి లో ని 600 చదరపు గజాలు పైబడిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, మరికొన్నింటిని సీజ్ చేయడం జరిగింది.దీంతో ఇప్పటివరకు హెచ్ఎండీఏ టాస్క్ ఫోర్స్ టీమ్స్ 101 అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసు ఉన్నది ఇందులో 78 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా మరో 23 అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు.
హెచ్ఎం డీఏ పరిధి లోని మున్సిపాలి టీలలో పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్ కారణంగా విధులకు దూరంగా ఉన్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ చర్యలకు కొంత అంతరాయం జరుగుతుందని అధికారు లు తెలిపారు.అక్రమ కట్టడాలు నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ నిరంతరం గా కొనసా గుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షిం చేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ కూల్చివేత నేపథ్యంలో.. అక్కడి ప్రజలు అందరూ ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: