317 లో ఎవరికి ఎన్ని మార్కులు?


తెలంగాణ రాష్ట్రంలో   రాజకీయం ప్రస్తుతం  జీవో నంబర్ 317 చుట్టూ కేంద్రీ కృతమైంది. ఉపాధ్యాయ బదిలీలకు  సంబంధించి ఆ రాష్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో ఇది. ఈ జీవో కు వ్యతిరేకంగా తొలత కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలిపింది.  ఆ తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ  తెలంగాణలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  కరీంనగర్ లో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇది ఈ శీతాకాలంలో రాజకీయంగా వేడిని పెంచింది. బండి సంజయ్ చేపట్టిన జనజాగరణ యాత్ర  రసాభాసగా మారింది. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, అసలు నిరసన కార్యక్రమాలకే అనుమతి లేదని, రాష్ట్రం లో కోవిడ్-19 ఆంక్షలు అమలులో ఉన్నందున నిరసన చేయడం సరికాదని పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.
పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది.  తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యం లోని పోలీసులు తీసుకున్న చర్యలపై బిజేపి శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజేపి ఎం.ఎల్.ఏ లు బండి సంజయ్ ఉన్న జైలు వద్దకు వెళ్లి మిలాఖత్ సమాయం మాట్లాడి వచ్చారు. రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో  బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నాలుగు రోజల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు విచ్చేశారు. ఆయన ఆగమ సందంర్భంగా బిజేపి తెలంగాణ శాఖ భాగ్యనగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.  కోవిడ్ ఆంక్షలు అమలు లోఉన్న కారణంగా  పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. అయితే  నడ్డా హైదరాబాద్ చేరుకోగానే పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా జేపి నడ్డా వద్దకు వెళ్లి కోవిడ్ నిబంధనలు, బిజేపి తలపెట్టిన శాంతియుత నిరసన  ర్యాలీకి అనుమతి లేదన్న విషయాన్ని వివరించారు. అయినా ఆయన అన్ని అడ్డంకులను దాటుకుని బిజేపి నిరసన కార్యక్రమంలో పాల్గోన్నారు. అలా తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ ఎపిసోడ్ ను కాస్త పక్కనుంచితే..
తెలంగాణ పిసిసి  అధ్యక్షుడు రేవంట్ రెడ్డి బిజేపి నిరసన కార్యక్రమాన్ని కొట్టి పారేశారు. టిఆర్ఎస్ పార్టీ ఆడమన్నట్లు రాష్ట్ర బిజేపి నేతలు ఆడుతున్నాారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఆరెస్టు, ఆ తరువాత జరుగుతున్న నిరసన కార్యక్రమాలు అన్నీ కూడా బిజేపి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కల్పించేందుకు ఉద్దేశించినవేనని సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు. ఇంతకీ 317 జీవో వల్ల  నష్ట పోయే బాధితులు భవిష్యత్తులో ఎవరికి మద్దతునిస్తారు. కాంగ్రెస్ పార్టీ కా ? బిజేపి కా? ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి ?

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: