జగనన్న : అనీల్ వ్యాఖ్యలు ఎవరికి చేటు ?
సూట్ అవుతారు
ఆయన ఆధ్వర్యంలో పోలవరం
మరియు ఇంకొన్ని
ఒడ్డెక్కిపోతాయి
అంతేకాదు పవన్ ను వచ్చే ఎన్నికల్లో
చిత్తు చిత్తుగా ఓడిస్తానని చెప్పే మొనగాడు
మెగాభిమాని కూడా ఆయనే !
ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది వాగేయ్యండి.. ఏం కాదు మీకు అధికారం ఉంది. అధికార దర్పం కూడా ఉంది.
బలం మరియు దర్పం ఉన్న వాళ్లను ఎదిరించడం అంత సులువు కాదు కనుక మేం అంతా నిశ్శబ్దం అయిపోతాం. మేం ఏమీ మాట్లాడం కూడా! ఎందుకంటే పవన్ గురించి మాట్లాడితే వారికి మద్దతుగా ఉంటే వైసీపీకి కోపాలు మరియు తాపాలు. అసలు పవన్ అభిమానిని అని చెప్పుకునేందుకు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏమయినా సమంజసంగా ఉన్నాయా? ఆయన కోసం ఈయన గుండు కొట్టించుకున్నారట! ఇంతకుమించిన అబద్ధాలు ఏమయినా ఉంటే అవన్నీ చెప్పమనండి. ఏం కాదు... అని అంటున్నారు జనసేన వర్గాలు.
ఆంధ్రావని రాజకీయాల్లో మంత్రి అనీల్ కు ఉన్న రేంజ్ కానీ ఇమేజ్ కానీ వేరు భయ్యా! ఆయనేం మాట్లాడినా అది సెన్సేషనే! ఆయన పవన్ కోసం గుండు కొట్టించుకున్నానని చెప్పారు..ఆయన పవన్ కోసం చాలా అమ్ముకున్నాను అని కూడా చెప్పారు.. ఇవన్నీ విని నవ్వుకోవాలి లేదా తప్పుకోవాలి కానీ మంత్రి సర్ ను మాత్రం ఏమీ అనకూడదు కూడా! ఎందుకంటే ఆయన నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు నడుపుతూ తనవంతు అన్ని సామాజికవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి. ఆయనేం చెబితే అది అక్కడ చెల్లుబాటు అవుతుంది. అక్కడే కాదు జగన్ దగ్గర కూడా చెల్లుబాటు అవుతుంది. వాస్తవానికి తొలి రోజుల్లో అనీల్ కు రాజకీయ రంగంలో ప్రాధాన్యం నిండు సున్నా. కాంగ్రెస్ లో ఆయనను పెద్దగా పట్టించుకునే వారు కాదని ఇప్పటికీ నెల్లూరు వాసులు చెబుతుంటారు. అదృష్టవశాత్తూ మంత్రి అయిన అనీల్ తనకూ తన సోదరుడికీ నెల్లూరులో ఎదురేలేదని చెబుతుంటారు. అందుకే ఆయన వ్యాఖ్యలు వైసీపీకి ఇప్పుడు ప్లస్సు రేపు మైనస్సు.