వావ్ : ఎట్టకేలకు దిగివచ్చిన జగన్!
వివాదం ఓ కొలిక్కి రానుంది మరికొద్ది క్షణాల్లో
ప్రాథమిక సమచారం ఆధారంగా రాస్తున్న కథనమిది...
రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రభుత్వ శాఖ దగ్గర డబ్బులున్నా అవన్నీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను తరలించాలని సీఎంఓ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ వర్శిటీ ఖంగుతింది. దీంతో ఏం చేయాలో పాలుపోక వీసీ నానా ఇక్కట్లూ పడ్డారు. ఆఖరికి అధిక వడ్డీ కూడా ఆశ చూపి బ్యాంకుల్లో ఉన్న ఎఫ్డీలను లిక్విడ్ రూపంలో మార్చి తామూ సూచించిన ఖాతాలకు జమ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై వీసీ స్పష్టమయిన ఓ స్టేట్మెంట్ ఇవ్వనున్నారని మీడియా నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం. ఒకవేళ ఇదే విషయం కనుక అమల్లోకి వస్తే ఉద్యోగులు విజయం సాధించినట్లే! ఎందుకంటే వారు తీవ్ర స్థాయిలో ఏపీ సర్కారు చర్యలను నిరసించి రోడ్ల మీదకు వచ్చి తమ గొంతుక వినిపించి వర్శిటీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
ప్రభుత్వ పెద్దలు మాత్రం తొలి రోజుల్లో అంటే నిర్ణయం వెలువరించిన రోజుల్లో ఏ మాత్రం సానుకూలంగా లేకుండా వర్శిటీ నిధులు ఎక్కడికీ పోవని తమకు ఇస్తే తరువాత అవసర రీత్యా మళ్లీ వెనక్కు ఇస్తామని చెప్పి వీసీ సమ్మతిని తీసుకునేందుకు ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ వీసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదన్న విధంగానే మాట్లాడుతూ వచ్చినా, ఆయనతో సజ్జల రామకృష్ణా రెడ్డి సంప్రతింపులు చేశారని తెలుస్తోంది. ఓ దశలో ప్రభుత్వ పెద్దలు ఆయనను హెచ్చరించి సెలవుపై వెళ్లిపోవాలని కూడా సూచించారని ఓ సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ్టి నిర్ణయం ఏ మేరకు వర్శిటీ భవిష్యత్ ను ప్రభావితం చేయనుందో అన్నది ఆసక్తిదాయకం.
ఈ తరుణంలో ఎట్టకేలకు ఏపీ సీఎం జగన్ దిగివచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి చెందిన నిధులను తాను ఏర్పాటు చేసిన ఫైనాన్స్ కార్పొరేషన్ కు తరలించాలని ఎప్పటి నుంచో వీసీని వేధిస్తున్న వార్త వాస్తవమేనని అక్కడి వర్గాలు తేల్చాయి. దీంతో వర్శిటీ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉద్యోగులు సైతం దీనిపై రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. కాన్వకేషన్ ను కూడా వాయిదా వేయించి మరీ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. దీంతో పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక వీసీ మాటకు విలువ ఇస్తూ నిధుల బదలాయింపును సీఎం వద్దనుకున్నారని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం అనుసరించి వీసీతో ప్రభుత్వ పెద్దల చర్చల అనంతరం నాలుగు వందల కోట్ల రూపాయల నిధుల బదలాయింపుపై ఓ స్పష్టత రానుందని కూడా వర్శిటీ వర్గాల మాట.