ఏపీ: జెసి ప్రభాకర్ రెడ్డి పై కూటమి మంత్రి ఫైర్..జగన్ పంచన చేరండి..?
ఈ వ్యవహారంలో మంత్రి సత్య కుమార్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో జెసి ప్రభాకర్ రెడ్డి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన ఘాటుగానే స్పందించారు.. జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడే మాటలు కంట్రోల్ లో ఉండాలని మీడియా అటెన్షన్ కోసం ఎప్పుడూ కూడా ఏదేదో మాట్లాడవద్దు బిజెపి ప్రభుత్వం తమ బస్సులను కాల్చింది అంటున్నారు.. ప్రభాకర్ రెడ్డి టిడిపి పార్టీకి స్పోక్స్ పర్సన ?.. జెసి ప్రభాకర్ రెడ్డికి జగన్ మీద అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లి చేరండి అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు.
ఎప్పుడు కాంట్రవర్సీ చేయడం జెసి ప్రభాకర్ రెడ్డికి అలవాటైపోయిందని జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలను దొంగవి అంటూ కేసు పెట్టారు.. దానికి బిజెపి ఏం చేస్తుంది అంటూ ఫైరయ్యారు. మాధవి లత కేవలం 31వ తేదీన రాత్రి పార్టీలకు ఫంక్షస్లు చేసుకునేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆమె హెచ్చరించింది అంతే తప్ప మరేం చేయలేదు కదా.. ఎవరు ఏ విధంగా మాట్లాడాలో జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పాలా నరేంద్ర మోడీ, చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తుందని ఇలాంటి సమయంలో ఇలాంటి వాక్యాలు చేయడం మంచిది కాదు అంటూ ఫైర్ అయ్యారు సత్యకుమార్.