ఎంఎస్ రాజు : ఎన్నో సంక్రాంతి సినిమాలు అందులో అనేక విజయాలు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలుగా కొనసాగే వారు ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని భావిస్తూ ఉంటారు. ఇక కొంత చిన్న స్థాయి నిర్మాతలకు పెద్దగా స్టార్ హీరోలు నటించని సినిమాలకు సంక్రాంతి సమయంలో విడుదల దొరకడమే కష్టం అవుతుంది. ఒక వేళ విడుదల దొరికినా కూడా ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలు విడుదలకు ఉంటాయి కాబట్టి చిన్న సినిమాలకు కష్టం అవుతుంది. దానితో చిన్న సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువ విడుదల కావు. ఇకపోతే ఎక్కువ శాతం స్టార్ ప్రొడ్యూసర్ , స్టార్ హీరోస్ నటించిన సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ ఉంటాయి.

ఇకపోతే కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి పండక్కు విడుదల చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నిర్మాత ఎమ్మెస్ రాజు ఒకరు. ఈయన తన కెరియర్ లో చాలా సినిమాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన ఎన్నో సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశాడు. దానితో ఆయనకు సంక్రాంతి రాజు అనే పేరు కూడా వచ్చింది. ఇకపోతే ఈయన తాను నిర్మించిన ఎన్నో సినిమాలను సంక్రాంతి పండక్కు విడుదల చేయగా అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఈయన నిర్మించిన సినిమాలలో సంక్రాంతి పండక్కి విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాలను అందుకున్న మూవీల లిస్టులో వర్షం , నువ్వు వస్తానంటే నేనొద్దంటానా మూవీలు ముందు వరుసలో ఉంటాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన వర్షం సినిమా 2004 వ సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత 2005 వ సంవత్సరం జనవరి 14 వ తేదీన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాను ఎమ్మెస్ రాజు సంక్రాంతి బరిలో నిలిపాడు. ఈ మూవీ కూడా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: