రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో రీతూ చౌదరి..?
ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్లు విలువ చేసే ఆస్తులను ఓ దొంగల ముఠా కొట్టేసినట్లు ఇప్పుడు ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ... ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్లు స్కాం జరిగిందని.. పలుగురు పెద్ద తలకాయల పేర్లు కూడా బయట పెడుతోంది ఎల్లో మీడియా. ఈ రూ.700 కోట్ల స్కామ్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ లకు ఫిర్యాదు అయింది.
ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ లకు ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖ రాసి.. ఫిర్యాదు చేశారట. దీంతో ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్లు విలువ చేసే ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. అయితే.. ఇక్కడ ముఖ్య విషయం ఎంటంటే... YS జగన్ సోదరుడు YS సునిల్, జగన్ PA నాగేశ్వర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చాయి. అంతేకాదు... టాలీవుడ్ సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ లపై ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ రాసిన లేఖలో ఈ నలుగురు పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో అంటే సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడే... విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో కోట్లు విలువ చేసే ఆస్తులను తనతో బలవంతంగా రిజిస్టర్ చేపించుకున్నారని లేఖలో పేర్కొన్నాడట ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్. ఇక ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖతో.. ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. జగన్ కు సంబంధించిన మనుషుల పేర్లు ఉండటంతో.. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారట చంద్రబాబు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.