సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు థియేటర్స్ అన్నీ స్టార్ హీరోల సినిమాలతో కలకళలాడి పోతాయి.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసే అద్భుతమైన సినిమాలు ఈ సీజన్ లో రిలీజ్ అవుతాయి.. అయితే సంక్రాంతి సీజన్ లో అప్పట్లో బాలయ్య కానీ మెగాస్టార్ కానీ ఎవరొకరి సినిమా ఉండాల్సిందే.. అయితే వీరిద్దరి సినిమాలు కనుక ఒకేసారి వస్తే అభిమానులకు పండగే.. 2004 సంక్రాంతి సీజన్ కి వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.. లక్ష్మీ నరసింహా సినిమాతో బాలయ్య వస్తే అంజి సినిమాతో మెగాస్టార్ వచ్చారు.. అయితే అంజి సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో బాలయ్య సినిమాకి కలిసొచ్చి సూపర్ హిట్ అయింది.. అంజి సినిమా సైతం అద్భుతంగా వున్నా కానీ ప్రేక్షకులను మెప్పించలేదు.. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో మల్లెమాల ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు..గతంలో కోడి రామకృష్ణ, శ్యాం ప్రసాద్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అద్భుతమైన గ్రాఫిక్ మాయాజాలం “ అమ్మోరు “ సినిమా అద్భుత విజయం సాధించింది.. దీనితో అంజి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..
మణిశర్మ మ్యూజిక్ కూడా సూపర్ హిట్ కావడంతో అంజి సినిమాకు తిరుగులేదనుకున్నారు..కానీ అంజి సినిమా కథ గానీ, గ్రాఫిక్స్ కానీ అద్భుతంగా వున్నా ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.. అయితే నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఏ సంక్రాంతి కైతే ప్లాప్ అందుకున్నారో మళ్ళీ అదే దర్శకుడితో అదే సంక్రాంతికి అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. దర్శకమాంత్రికుడు కోడి రామకృష్ణ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం‘అరుంధతి’.. అప్పటివరకు గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమవుతూ వచ్చిన అనుష్క లోని అభినయ సామర్ధ్యాన్ని వెలికి తీసి, ఆమె కెరీర్‌ను టర్న్ చేసే ‘అరుంధతి’ చిత్రాన్ని దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు... ‘అరుంధతి, జేజెమ్మ’ పాత్రలలో అనుష్క కనబరిచిన అభినయం.అందరికి ఎంతగానో నచ్చింది.. ఆ సినిమా అనుష్క కెరీర్ లో ఒక మైల్‌స్టోన్ మూవీగా నిలబడింది.2009 జనవరి 16 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా గ్రాఫిక్ మాయాజాలనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించి అద్భుత విజయం అందుకున్నారు..