ఆ హీరోతో లయ పెళ్లి అందుకే ఆగిపోయిందా... ఫస్ట్ టైం బయటపెట్టిన హీరో...!
హీరోగా త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయిన సాయికిరణ్ ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుడిగుండాలు - మౌనరాగం - కోకిలమ్మ - అభిలాష - గుప్పెడంత మనసు - ఇంటిగుట్టు లాంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో సాయికిరణ్ తన మొదటి లవ్ స్టోరీ గుర్తుచేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాయికిరణ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో కాదు లయ. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారని... త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ప్రేమించు సినిమా టైములో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని ఎంతోమంది మెచ్చుకున్నారని .. మేమిద్దరం ఒకటైతే బాగుంటుందని ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారు.. నేను ఓకే చెప్పాను .. కానీ మా జాతకాలు కలవకపోవడం వల్ల పెళ్లి పీటల వరకు వెళ్లలేదని సాయికిరణ్ తెలిపారు. తనతో పాటు లయ వాళ్ళ ఇంట్లో కూడా జాతకాలని ఎక్కువగా నమ్ముతారని అందుకే జాతకాలు కలవకపోవడం వల్ల మరో మాట లేకుండా లైతో పెళ్లికి దూరమైనట్టు సాయికిరణ్ తెలిపారు. అలాగే లయ ఒక డాక్టర్ను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలై ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తోంది. సాయికిరణ్ కి గతంలోని వివాహమైంది.. ఒక కూతురు కూడా ఉంది.. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయి ఇటీవల సీరియల్ నటిని వివాహం చేసుకున్నారు.