ఈ రోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిందని తెలిపారు తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేశారని.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సిటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుందని తెలిపారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల అయిందని.. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ ఉందని తెలిపారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్.
కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఉందని.. నవంబర్ 16 న నోటిఫికేషన్ వెలువదిందని..
నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అని వెల్లడించారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన ఉంటుందని.. నవంబర్ 26 ఉప సంహరణ కు చివరి తేదీ ఉంటుందని తెలియ జేశారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. డిసెంబర్ 10 పోలింగ్ అని.. డిసెంబర్ 14 కౌంటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందిని.. కోవిడ్ 19 ఉంది కాబట్టే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్..
ఎన్నికల ప్రచారంలో ECI ఇచ్చిన కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని.. వ్యాక్సినేషన్ కూడా అందరికి వేయాలి. ఇవాల్టి నుండి మెడల్ కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్.
ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఏవిధంగా ఉంటుందో అలానే ఈ ఎన్నికలకు కోడ్ ఉంటుందని.. అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. రాజకీయ పార్టీల నేతలు ,ఓటర్లు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు, మెడల్ కోడ్ ను పాటించాలని.. 500 మంది కంటే ఎక్కువ మందితో సభలు సమావేశాలు పెట్టారాదని పేర్కొన్నారు ఎన్నికల అధికారి శశాంక్ గోయల్. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయగర్జన సభ వాయిదా పడింది. దీంతో టిఆర్ఎస్ పార్టీ ఊహించని షాక్ తగిలింది. ]