ఏపీలో మళ్లీ ఎలక్షన్స్.. ఎప్పుడంటే?

praveen
సాధారణంగానే ఎలాంటి ఎన్నికలు లేకుండానే ఏపీ రాజకీయాలు వాడివేడిగా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో వాడి వేడిగానే ఏపీ రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటాయి. అలాంటిది ఎన్నికలు వచ్చాయి అంటే చాలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోతాయి  ఏపీ రాజకీయాలు. అయితే మరికొన్ని రోజుల్లో ఏపీ రాజకీయాలల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది అన్నది అర్ధమవుతుంది.

 మొన్నటి వరకు ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఆ తర్వాత బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా రాజకీయాలు హాట్ హాట్ గానే ఉన్నాయి. ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇక మరికొన్ని రోజుల్లో మరోసారి ఏపీలో ఎన్నికల నగారా మోగబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఆగస్టు 11వ తేదీ తో పదవీకాలం ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఎదురు చూస్తున్నారు.

 కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ ను ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇక ఈ నెల 23 సాయంత్రం 5 గంటల వరకు కూడా పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఎన్నికల కమిషన్ తెలిపింది. 24న అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక 26 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు  కూడా గడువు ఉంటుంది. డిసెంబర్ 10న 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక డిసెంబర్ 14వ తేదీన కౌంటింగ్ జరగగా 16వ తేదీ లోపుఫలితాలు విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: