ఏపీ: జగనే మళ్లీ సీఎం.. ట్రెండ్ సెట్ చేస్తున్న సోషల్ మీడియా..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఓటింగ్ సైతం నిన్నటి రోజున ముగిశాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే లక్ష్యంతో వైఎస్ఆర్సిపి పార్టీ చాలా బలంగా దూసుకెళ్లింది.. కూటమిలో భాగంగా బిజెపి జనసేన టిడిపి పార్టీలు కూటమిగా పోటీ చేశాయి.. వైసీపీ పార్టీ మాత్రం ముందు నుంచే తామే గెలుస్తామని దీమాని కూడా తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా ప్రత్యర్థుల బలాలు బలహీనతల ఆధారంగానే అంచనాలు వేసి మరి ఈ ఎన్నికలు పూర్తి చేసినట్లు కనిపిస్తోంది..

మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని టిడిపి,జనసేన, బిజెపి పార్టీలు పోటీ పడ్డాయి.. అన్నీ కూడా తమకే కలిసి వస్తున్నాయి అంటూ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం 79 నుంచి 80% వరకు తమకే కలిసొస్తోందంటూ తెలుపుతున్నారు. అయితే పోలింగ్ సర్వేలను బట్టి రాజకీయ పార్టీలు వేటికవి అంచనాలు వేసుకుంటున్నారు.. నిన్నటి రోజున సాయంత్రం ఐదు గంటల వరకు 68.9 శాతం నమోదు కాక 6 గంటల తర్వాత క్యూ లైన్ లో ఉన్న ఓటర్లందరినీ కలుపుకుంటే 79% వరకు చేరుకున్నట్లు సమాచారం.

నిజానికి పోలింగ్ సరన్ బట్టి అంచనా వేయలేని పరిస్థితి ఉన్నది. ఓటర్ల తీర్పు చాలా నియోజకవర్గాలలో చాలా సైలెంట్ గానే ఉందని చెప్పవచ్చు.. మరొకవైపు వైసీపీ పార్టీ మాత్రం జగన్ సునామీని అన్నట్లుగా ట్యాగ్ నీ ట్రెండ్ చేస్తున్నారు. మరోసారి తమ పార్టీని అధికారం వస్తుందంటూ పలువురు నేతలు కూడా ధీమాతో ఉన్నారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ కూడా వైయస్సార్ పార్టీకి అనుకూలంగా ఉందని విధంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు.. మరి సోషల్ మీడియాలో మాత్రం జగన్ సునామి ట్యాగ్ గట్టిగానే ట్రెండ్ అవుతోంది.. మరి పూర్తి ఓటింగ్ శాతం ఈరోజు తెలియబోతోంది.. మరి అధికారం ఎవరిది అనే విషయం వచ్చే నెల నాలుగవ తేదీ తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: