ఏపీ: ఫలితాలు అంచనా.. మ్యాజిక్ రిపీట్..!

Divya
ఆంధ్ర పోలింగ్ నిన్నటి రోజున సాయంత్రం ముగిసింది.. ముఖ్యంగా పర్సంటేజ్ పెరిగిపోయింది దీంట్లో ఏమవుతుందని వాస్తవంగా ఇది నేతలను ప్రజలను నరాలు తెగే ఉత్కంఠ. ప్రతి ఒక్కరు కూడా ఎవరు గెలుస్తారని ప్రశ్న మొదలవుతోంది. అయితే ఎవరి లెక్కలు మాత్రం వారికి ఉన్నాయి.. అయితే కొన్ని ప్రాక్టికల్ గా చూసుకున్నట్లు అయితే.. 2014లో 74% వరకు పోలింగ్ జరిగింది.. అప్పుడు వైసీపీ పార్టీకి 67 సీట్లు వచ్చాయి.. టిడిపి పార్టీకి పొత్తుతో కలిపి 107 సీట్లు వచ్చాయి.

అలాగే 2019లో చూసుకుంటే.. 79 శాతం పోలింగ్ జరిగింది.. ఏకంగా 2014తో పోలిస్తే ఐదు శాతం ఓటింగ్ పెరిగింది. టిడిపి పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. వైసిపి ఏకంగా 151 యొక్క సీట్లను గెలుచుకుంది. ఆరోజున మహిళలు ,విలేజ్ ఓటర్స్ వైసిపి పార్టీకి అండగా నిలిచారు. ఫైనల్ ఫిగర్స్ ఈరోజు గాని క్లారిటీ రాదు.. 74- 75 రేంజ్ లో జరిగితే.. 2014 రిపీట్ అవ్వచ్చు.. 79-80 దగ్గర వెళితే.. 2019 రిపీట్ అవ్వచ్చు.. రిపీట్ అనేది ఎటువైపు అయిన కావచ్చు.

మహిళలు వృద్ధులు వికలాంగులు.. అట్లాగే ఎవరైతే పథకాలు పొందిన వారు ఉన్నారో వారి యొక్క ఆలోచన అత్యంత కీలకమైనది. అయితే ఇందులో పెన్షన్ ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి వృద్ధులకు సంబంధించి.. ఆశించినంతగా వెళ్లలేదు.. అయితే కొంతమంది జనసేన , తెలుగుదేశం సింపతిపై చేసిన వారు మాత్రమే నమ్మారు. మిగతా వాళ్ళు మాత్రం నమ్మలేదు.. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్పిన ఇందులో కేవలం టిడిపి మహిళలు మాత్రమే నమ్మారు.. జనసేన సింపతి మహిళలు కూడా నమ్మారు. అలాగే వైయస్సార్ మహిళలు నమ్మలేదు తటస్థ మహిళలు కూడా నమ్మలేదు.. ప్రస్తుతం ఇది జరిగినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మహిళల పర్సంటేజ్ ఎంత అనేది ఒక ప్రశ్న.. ఎక్కువగా యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ మాటలకు ఇంప్రెస్ అయ్యారు.. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు కిందటిసారి 30% దాకా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. ఈ దెబ్బ ఒక 10% కోల్పోవచ్చు.. ముస్లిం ఓట్లు 30 శాతం దాకా కిందటిసారి టిడిపికి పడగా.. ఇక్కడ కూటమి కాబట్టి 10% కోల్పోయే అవకాశం ఉన్నది. మరి ప్రజలు ఎవరిని నమ్మారనే విషయం మరో కొద్ది రోజులలో తేలుతుంది.మొత్తానికి ఎవరు గెలిచినా కూడా 100 సీట్ల పైనే వస్తాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: