ఐఎస్ దృష్టి.. షియాలపైనే..!

Chandrasekhar Reddy
తాలిబన్ లు ఆఫ్ఘన్ స్వాధీనం నుండి అక్కడి మైనారిటీకి చెందిన మతస్తులను అందరిని చంపేసింది ఐఎస్. తాజాగా తమ మతంలోనే మరో వర్గంపై తీవ్రంగా విరుచుకుపడుతుంది. అదే షియాలు, వీళ్ళను ప్రస్తుతం ఐఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. షియాలు ఎక్కడ ఉన్నా వాళ్ళను అంతం చేయడం తమ ప్రస్తుత లక్ష్యం అంటూ బహిరంగంగానే చెప్పేస్తుంది. ఇప్పటికే వారిని లక్ష్యంగా చేసుకొని ఆఫ్ఘన్ లో పలు మసీదులపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అనేక మందిని ఇంటాబయటా అనే తేడా లేకుండా చంపేస్తాం అంటూ ఐఎస్ తాజాగా ఒక ప్రకటన చేసింది. అంటే ఇక ఆఫ్ఘన్ లో కేవలం ఐఎస్ సంబంధిత ఇస్లాం తప్ప మరొకరు ఉండకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. కారణం వేరే వాళ్ళు తమ ఆచరణను, చట్టాలను అనుసరించేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆయా వర్గాలను నాశనం చేసి, తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మరోవిధంగా ఆలోచిస్తే, ఈ విధమైన షియాల అంతంతో ప్రపంచంలోని ఇతర షియాలలో భయం ఆందోళనలు కలిగింది, వారిని బలవంతంగా అయినా తమ చట్టాలను పాటించే విధంగా తీర్చిదిద్దుకోవాలన్నది వాళ్ళ అభిమతం కావచ్చు. తద్వారా ఇస్లాం అంతా ఒకే విధంగా జీవించాల్సి వస్తుంది. కానీ ఇప్పటి ప్రపంచంలో ఇస్లాం కూడా ఆయా దేశాల స్థితిగతులను బట్టి స్వేచగానే బ్రతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా స్వాతంత్రంగా జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివి సహించలేని ఈ మతఛాందస వాదులు వారందరిని భయపెట్టడానికి తమలోని ఒక వర్గాన్ని నాశనం చేయడానికి సిద్ధం అయ్యాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం లోని అందరు, ముఖ్యంగా మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలని వాళ్ళ ఆలోచన.
ఈ విధమైన ముర్కపు చర్యలు ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ లోని రాక్షసత్వం మరింతగా బయటపడుతుంది తప్ప వాళ్ళను అనుసరించే వాళ్ళు మాత్రం పెరగబోరనేది స్పష్టమైన నిజం. దానిని ఎప్పుడు వాళ్ళు గ్రహిస్తారో అప్పుడే ఇలాంటి చర్యలు ఆపుతారు. ఇస్లాం అంటేనే శాంతి దూత అనే అర్ధం వస్తుంటే, వీళ్లకు మాత్రం అది అర్ధం కాకపోతే అది వాళ్ళ మూర్ఖత్వం. ఈ చర్యలకు వాళ్ళు సిగ్గుపడే రోజులు రాకపోయినప్పటికీ, ప్రపంచం వారి చర్యలకు ప్రతిస్పందించకుండా తమపని తాము చేసుకుపోతే కాస్త శ్రేయోదాయకం. ఆఫ్ఘన్ ఇప్పుడొక పిచ్చాసుపత్రి అనుకుని వదిలేయడం మేలు. అయితే అక్కడ ఉన్న ఆఫ్ఘన్ ప్రజలను మాత్రం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉంది, అది ఎలాగూ అనేది అందరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: