ప‌సుపు పూలు : జూనియ‌ర్ రాడు స‌ర్!

RATNA KISHORE
నా వ‌ర‌కూ..నా ద‌గ్గ‌ర..నా ప్రాంగ‌ణాన రాజ‌కీయాలు మాట్లాడొద్దు..ప్లీజ్ అని ఓ పెద్ద హీరో అంటున్నాడు. అలా అన‌డం స‌బ‌బేనా?


చంద్ర‌బాబు ఒక్క‌రే పార్టీకి దిక్కు అవుతున్నారు. టీడీపీని గాడిలో పెట్టేవారే లేరు. ఉన్న‌వారంతా ప‌ద‌వుల కోసం ఉన్నారు. వ్యాపారాల కోసం బీజేపీ తో స్నేహం చేస్తూ  ఉన్నారు. ఇలాంటి సందర్భాన వైసీపీకి దెబ్బ‌కొట్టే హీరో లేడు. రావాలి కానీ వ‌స్తాడో రాడో తెలియదు. ఎవ‌రో రావాలి వ‌చ్చి తారక రాముడి పార్టీకో ఆత్మ గౌర‌వాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవ్వాలి. కానీ ఆ ప‌ని ఇప్ప‌టిక‌ప్పుడు నెర‌వేరేనా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపైన‌ర్ల వెతుకులాటలో బాబు ఉన్నారు. అదే ఎవ్వ‌రు?


తెలుగుదేశ పార్టీ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలోనూ, అంత‌కుమించిన క‌ష్టంలోనూ ఉంది. నాటి ప్రాభవం ద‌క్కించుకునేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నా అవేవీ ఫ‌లించ‌డం లేదు. పార్టీలో లోకేశ్ ను ఆయ‌న నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ‌ని వారే ఎక్కువ‌. అచ్చెన్న కూడా ఏనాటి నుంచో లోకేశ్ ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఇదే సంద‌ర్భంలో బాబు కూడా కొంద‌రి నాయ‌కుల‌కు బుజ్జగింపులు చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు టీడీపీకి స్టార్ క్యాంపైన‌ర్లు కావాలి. బాగా మాట్లాడి  మీడియా ఎదుట వాగ్ధాటి చూపే నాయ‌కులు కావాలి. ఇప్పుడున్న వారంతా పాత పాట వినిపించేవాళ్లే కానీ వారికి ఉన్న స‌బ్జెక్టు చాల‌డం లేదు. మీడియాను ముఖ్యంగా సోష‌ల్ మీడియాను ఫేస్ చేయ‌డం చేత‌గావ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం ఐ టీడీపీ పేరుతో కొంద‌రిని నియ‌మించి ప‌నిచేయిస్తున్నా అవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదు. ఈ స‌మ‌యంలో ఎవ‌రు వ‌స్తారు?


ఆనాటి బాలుడు ఈనాడు రాముడు అని పాడుకుంటూ పెరిగిన‌వాడు తార‌క్. తాత పోలిక‌ల‌తో స‌హా, తాత న‌ట వార‌సత్వం అందుకు న్న వాడు తారక్. అంతేకాదు పార్టీ విష‌య‌మై నిబ‌ద్ధ‌త ఉన్న సైనికుడు. పార్టీకి విధేయుడు. అయినా కూడా రాజ‌కీయాల్లోకి రాడు.. డు డు డు .. అవును! ఎందుకంటే త‌న‌కు సంబంధించినంత వ‌ర‌కూ సినిమాల్లోకే ప‌రిమితం కావాల‌ని భావిస్తున్నాడు. గతంలో ఓ సంద‌ర్భంలో పార్టీ త‌ర‌ఫున ప్రచారం చేసినా, అది కేవలం తండ్రి హ‌రికృష్ణ ఆదేశాల మేర‌కే అని తేల్చేశాడు. కానీ ఇప్పుడు పార్టీ కష్టా ల్లో ఉంది. క‌ష్టాల్లో ఉన్న రాముడి పార్టీకి కాస్త‌యినా సాయం చేయాల‌ని అనుకోవ‌డం స‌బ‌బు. అందుకే బాబు ఈ సెంటిమెంట్ రాజ కీయాల‌ను తెర‌పైకి తెస్తున్నాడు. తార‌క్ మాత్రం నో అంటున్నాడు. ఇప్పుడెలా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: