అనుకూల మీడియాను గుప్పిట్లో పెట్టుకున్న అక్కినేని కుటుంబం సమంత విషయమై తప్పు చేసిందన్న వాస్తవాలే ఎక్కువ విన వస్తున్నాయి. మరోవైపు నేరం మరియు నింద సమంత పై వేసేందుకు ఇంకొందరు ఇష్యూని వాడుకుంటున్నారు. సోషల్ మీడియా లో క్రేజ్ కోసం కొందరు కొన్ని మాటలు, వ్యక్తిత్వ సంబంధ వివరణలూ ఇస్తున్నారు. ఇవేవీ ఆ బంధాన్ని నిలపవు అని తేలిపోయాక ఇంకెన్ని కబుర్లు చెబుతారని? ఆ కుటుంబంలో వివాదం అక్కడికే పరిమితం అనుకోలేం. అక్కినేని కుటుంబంలో ఇదొక కొత్త కథ అని కూడా చెప్పలేం. అలాంటప్పుడు ఈ దాగుడు మూతలు ఎందుకని? ఆ మాత్రం చెప్పలేరా లేదా చెప్పలేకా?
అక్కినేని కుటుంబంపై మళ్లీ వివాదాలు రేగుతున్నాయి. గతంలో కన్నా ఇంకా ఘాటు వ్యాఖ్యలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. సమంత, చై బంధం విడిపోయిన నేపథ్యంలో అటు నాగార్జున హుందాగా స్పందించినా, ఇటు వెంకీ మోటివేషన్ మాటలు సోషల్ మీడియాలో రాసినా, అసలు వివాదం ఏంటన్నది ఇప్పటికీ తెలియడం లేదు. సన్నిహిత వర్గాలు కూడా పెద్దగా మాట్లాడడం లేదు. మీడియా కూడా అక్కినేని కుటుంబంపై సానుభూతి చూపిస్తుంది కానీ వార్తల్లో వాస్తవాలు మాత్రం చెప్పడం లేదు. కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే వార్తలు వెలుగు చూస్తున్నాయి కానీ వార్తలకు, వెనుక నేపథ్యాలకు, వీటికి కారణంగా నిలిచిన కొన్ని ఘటనలకూ అస్సలు అంతూ పొంతూ లేకుండా పోతోంది. సమంత మాత్రం ఒక మోటివేషనల్ పోస్టు పెట్టి ఊరుకుంది.
తన ప్రపంచాన్ని తానే దిద్దుకోవాలని భావిస్తున్నానని అర్థం వచ్చేవిధంగా పోస్టు రాసి ఊరుకుంది. అటుపై కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. గాయని చిన్మయి కూడా ఆమెకు బాసటగా ఉన్నారు. సమంతకే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు సమంత కెరియర్ పై కూడా ఏ స్పష్టతా లేదు. దేనిపైనా స్పష్టత ఇవ్వకుండా రోజులు మాత్రం దాటిస్తన్నారు. క్యాలెండర్ పేజీలు దాటిస్తున్నారు. మరోవైపు సమంత సన్నిహిత వర్గాలు అక్కినేని కుటుంబం ఆమెను చూసిన విధానం బాలేదనే అంటున్నారు. ఆమె స్టైలిస్ట్ ప్రీతం ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తీస్తున్నాడు. మగవారి మానసిక హింస ను ఉద్దేశించి ఓ పోస్టు రాసి తీసేశాడు. ఎందుకనో ఆయన ఇలా రాస్తాడు అలా తీస్తాడు. వీటిపై చై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ అక్కినేని కుటుంబం సమంతను బాగా చూసుకోకపోతే అందుకు తగ్గ కారణం మాత్రం అయితే అమల కావాలి లేదా చై కావాలి. నాగార్జున కూడా అందుకు స్పష్టమయిన కారణం అయి ఉండాలి. వీళ్లలో ఎవరు ఆమె జీవితాన్ని మార్చాలని చూశారు?