కడప జిల్లా : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సుధా ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేశారని పేర్కొన్నారు.. ఎన్నికల ప్రచారంలో ప్రజా వద్దకు వెల్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం తెలియ జేయాలని.. గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం దాదాపు 300 కోట్ల తో సాగు , తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
కుందు నది నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మం సాగర్ కు నీటిని తరలించి కరవు పరిస్థితి లో కూడా బద్వేలు ప్రాంత రైతాంగానికి నీరు అందించబోతున్నామని ప్రకటన చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వ్యవసాయనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టబోతున్నామని.. బద్వేలు చెరువుకు నీరు అందించేందుకు LSP కాలువ విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. బద్వేలు మున్సిపాలిటీ అభి వృద్ధి కోసం రూ 130 కోట్ల తో పనులు చేస్తున్నామని పేర్కొన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
సుదీర్ఘ కాలం పెండింగు లో ఉన్న బద్వేలు రెవెన్యూ డివిజన్ ను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..
పెద్దఎత్తున బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్ లో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ రాబోతోందని వెల్లడించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేసి భారీ మెజారిటీ తో డాక్టర్ సుధా ను గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం ఖాయమన్నారు.