మోడీ నిజంగా పని రాక్షసుడా..?
అయితే, గతంలో భారత ప్రధానిగా పని చేసిన వీపి.సింగ్, మన్మోహన్ సింగ్, దేవే గౌడ్ లతో పోల్చినప్పుడు. మోడీ గుర్తుకు వస్తారు. నరేంద్ర మోడీకి అసలు వ్యక్తి గత జీవితం విషయాన్ని పట్టించుకోడని కమల దళ నాయకులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే నరేంద్ర మోడీ నిబద్ధత మనకు కనిపిస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న నాలుగురోజుల పాటు అమెరికా పర్యటనలో మోడీ ఉన్నారు. ఇందులో 20కి పైగా సమావేశాలు, భేటీలు నిర్వహించారు. ఇలా విరామం లేకుండా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు.
సాధారణంగా మనం ఏ ఊరికి అయిన వెళ్లి వస్తే దాదాపు మూడు నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటాం. కానీ, మోడీ 60 గంటల పాటు విదేశం అయిన అమెరికాకు విమానంలో ప్రయాణం చేసి తిరిగి భారత్కు వచ్చారు. వచ్చిన తరువాత ఎలాంటి విరామం తీసుకోకుండా తన పనుల్లో మునిగిపోయాడు. రక్షణ శాఖా మంత్రి తో రివ్యూ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను సందర్శించాడు. ఎప్పటిలాగే తన పనిలో కంటిన్యూగా నిమగ్నం అయ్యారు.