డైలామాలో టీడీపీ : ఎర్రన్న తరహా పోరాటం సాధ్యమేనా?
రాజశేఖర్ రెడ్డి అక్రమాస్తులపై అప్పటి టీడీపీ లీడర్ దివంగత నేత ఎర్రన్నాయుడు పోరాడారు. శ్రీకాకుళం జిల్లాలో అప్పటి ప్రభు త్వం నేతృత్వంలో జరిగిన కొన్ని అడ్డగోలు అనుమతుపైనా గొంతు వినిపించారు. అలాంటి పోరాటం ఇప్పుడు లేదు. టీడీపీ ఏమీ మాట్లాడడం లేదు. ఎక్కడా ప్రజా సమస్యలపై పోరాడడం లేదు. కలర్ గ్రానైట్ తవ్వకాలపై మాట్లాడకపోవడం విచారకరం. ఇక్కడ కొండ తరలిపోయినా టీడీపీ గొంతెత్తదు అన్నది నిర్థారణ అయిపోయింది. ఇప్పుడిక ప్రతిపక్షం ఉండి లాభం ఏంటి?
కలర్ గ్రానైట్ తవ్వకాలు జరిగినా, కొండలు తరలి ఉత్త మట్టే మిగిలినా, ఇసుక తవ్వకాలు జరిగినా, మట్టి తవ్వకాలు జరిగినా ఏవి జరిగినా టీడీపీ మాట్లాడడం లేదు. కేవలం కేసుల భయంతోనే వెనుకంజలో ఉంది. అధికార పార్టీ ఆగడాలను నిలువరించి, తన దైన పంధాలో రాజకీయం నడపాల్సిన పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. వామపక్షాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పార్టీలు పొలిటి కల్ మైలేజీ కోసం తాపత్రయ పడుతుండడంతో వాటికి అనుగుణంగా ఉన్న అంశాలతోనే పోరాటాలు చేయాలనుకోవడం అవివేకం. ప్రజలకూ, ప్రకృతికీ విఘాతం కలిగించే ఏ చిన్న పని కూడా అవరోధం అన్న విషయం గ్రహింపులో లేకపోవడమే ఇప్పటి వివాదా లకు కారణం. ఆ రోజు ఎర్రన్నాయుడు ఎన్నో పోరాటాలు నడిపారు. ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు మాత్రం అలా లేరు. ఆ పోరాట స్ఫూర్తి ఆయనలో లేదు అన్న విమర్శలను ఆయన చవి చూస్తున్నారు. విలువైన ప్రకృతి సంపద పక్కదోవ పట్టిన సం దర్భాల్లో కూడా టీడీపీ ఒప్పందాలతో కూడిన మౌనం పాటించడం వెనుక అసలు కారణాలేంటి?
శ్రీకాకుళం జిల్లాలో గత కొద్ది రోజులుగా టీడీపీ ఎందుకనో సైలెంట్ అయిపోయింది. ప్రజా పోరాటాలు అన్నవి పై పై మాటలకే పరిమి తం కావడంతో అనూహ్య రీతిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పో తోంది. నాడు కన్నెధార (సీతం పేట పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండ) తవ్వకాలపై అనుమతులు పొందడాన్ని తప్పు పడుతూ అప్ప టి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై పోరాటం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు వ్యూహాత్మకంగానే సైలెంట్ అయిపోయా రు. కొండ తవ్వకం కారణంగా జరిగే నష్టాలను ఈనాడు పేపర్ సాయంతో కథనాలు రాసి, సంచలనాత్మక ధోరణికి కారణం అయిన జర్నలిస్టులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆ రోజు కన్నెధార పోరాటం అన్నది ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లిన ఎర్రన్నాయుడు ఎంతో పేరు తెచ్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడిన నేపథ్యం ఆయనకే సొంతం అన్న విధంగా పేరు తె చ్చుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ ఆ స్థాయిలో పని చేయడం లేదు.