జ‌గ‌న్ అంటే సీఎం : సొంత మ‌నిషే కొత్త సీఎస్? రాసి పెట్టుకోండి

RATNA KISHORE
తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలోనూ కొన్ని మార్పుల‌కు శ్రీ‌కారం దిద్ది త‌ద‌నుగుణంగా పాల‌న‌లో మేలి మి మార్పులు తీసుకురావా లన్నది సీఎం జ‌గ‌న్ సంక‌ ల్పం. త‌న వారికి స‌మున్న‌త స్థానాలు ఇవ్వ‌డంలో నాన్న బాట‌ను అనుస రించి సొంత మ‌నిషికే కొత్త సీ ఎస్ ను చేయాల‌ని భావించ‌డంలో ఆంత‌ర్యం కూడా ఇదే! స‌మీప భ‌విష్య‌త్ లో జ‌ర‌గనున్న కొన్ని ఐఏ ఎస్, ఐపీఎస్ స్థా నాల చ‌లనంలో జ‌గ‌న్ మార్కు సుస్ప‌ష్టం కానుండ‌డం వాస్త‌వం. ఇందుకు సంబంధించి అందిస్తున్న వివ‌రం ఇది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ వెతుకులాటలో ఉంది అని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన స్పష్టమైన సమాచారం  వెలు గులోకి రానుంది. వైయస్ జగన్ తనకు అత్యంత సన్నిహితంగా మెలిగే సీనియర్ ఐఏఎస్ అ ధికారికి ఈ ఈ పదవిని అందించేందు కు ఆలోచిస్తున్నారు అని సమాచారం. ఏపీ సీఎం వర్గాలనుంచి వినవస్తోంది గతంలో సిఎస్ గా పనిచేసిన వారంతా ముఖ్యమంత్రు ల ఆదేశాల అనుసార‌మే నడుచుకున్నారు. కొన్ని వివా దాస్పద వ్యాఖ్య‌ల‌తో అప్ప‌టి సీఎస్ కృష్ణారావు వార్త‌ల్లో నిలిచిన‌ప్ప‌టికీ మిగ తావారంతా బుద్ధిగా సీఎం ఏం చెబితే అది అన్న విధంగానే విధేయులుగా ఉండ‌డం విశేషం. ఇదే తోవలో, ఇదే కోవ‌లో ప్ర‌వ‌ర్తనా ని య‌మావ‌ళిని పా టించిన ఇప్పటి సిఎస్ ఆదిత్య కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నికల స‌మ‌యం సమీపిస్తున్న సమ యానికి తనకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉండే అధికారులకు కీలక స్థానాలను అప్పగించి తదనుగుణంగా తన రా జకీయ వ్యూహ చతురతను అమలు చేయాలి అన్న‌ది వైఎస్ జ‌గ‌న్ భావ‌న‌.
ఈ త‌ర‌హా ఆలోచ‌న‌ల ప‌రంప‌రంలో భాగంగా కొత్త సిఎస్ నియామకం వి షయమై సీఎం కొంతమేరకు ఓ స్పష్టతతో ఉన్నారని తె లుస్తోంది. ఈ జాబితాలో నలుగురు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. వాస్తవానికి చంద్ర బాబు హయాంలో చక్రం తిప్పిన ఐఏ ఎస్ అధికారులను పక్కన పెట్టి జవహర్ లాంటి సీనియర్లకు లేదా అం దుకు తగ్గ పరిణితి ఉన్న ఐఏఎస్ అధికారులకు చోటివ్వాలి భావిస్తున్నారు ఇదే దశలో ఆరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి అక్రమాస్తుల కేసు లో నిందితురాలిగా నమోదైన శ్రీ లక్ష్మి పేరు, అదేవి ధంగా పూనం మాలకొండయ్య పేరు సతీష్ చంద్ర పేరు, జవహర్ రెడ్డి పేరు , అజ య్ సాహ్ని (ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని భ‌ర్త‌) పేరు వినబడు తోంది ఇటీవలే తెలంగాణలో మాదిరిగానే ఐఏఎస్ ఐపీఎస్ సం బంధించి తన మనుషులను నియ మించుకునే ప్రక్రియలో జగన్ ముందడుగు వేస్తూ తన రాజకీయ పరిమితికి సంబంధించి మె రుగులు దిద్దుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: