వీడియో గేమ్స్‌పై ‘చైనా’ ఆంక్షలు ..?

Suma Kallamadi
చైనా ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో ఎవ‌ర‌మూ చెప్ప‌లేం. ఎందుకంటే ఆ దేశంలో అప్పటిక‌ప్పుడే చిత్ర విచిత్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. అప్ప‌టి వ‌ర‌కు చేయాల‌న్న ప‌నులే స‌డెన్ వ‌ద్దు అని కూడా చెప్తుంటారు. ఇక స‌డెన్‌గా ముగ్గురు పిల్ల‌లు కనడంపైన ఆంక్షలు ఎత్తేసిన చైనా దేశం ఇప్ప‌డు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది. అస‌లు విష‌యం ఏంటంటే చిన్న పిల్లలు ఆడి వీడియో గేమ్స్‌పై ఇప్పుడ చైనా ప్ర‌భుత్వం కొన్ని ర‌కాల ఆంక్షలు తీసుకొచ్చింది. దీంతో ఆ దేశఃలో 18 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారంతా కూడా ఇక‌పై ఒక వారంతో కేవ‌లం మూడు గంట‌లు మాత్రమే ఈ వీడియో గేమ్స్ ఆడుకోవ‌చ్చు. కాగా ఈ ఆంక్షలు త్వ‌ర‌లోనే చైనా ప్ర‌భుత్వం విధించనుందని స‌మాచారం.
2021, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతీ శుక్రవారం, వీకెండ్స్‌, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే గేమ్స్‌ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది. 2019లో జారీ చేసిన నిబంధనల ప్రకారం రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆడుకునే వెసులుబాటు మైనర్లకు ఉంది. ఇప్పుడు ఆ సమయాన్ని క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం అయిన జిన్ పింగ్ స‌ర్కార్ మ‌రింత‌గా త‌గ్గిస్తూ కేవలం మూడు గంటల వ‌ర‌కు పిల్ల‌ల‌కు ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ కొత్త నిబంధనలతో చైనాలోని గేమింగ్‌ దిగ్గజం టెన్సెంట్‌తో పాటు అలీబాబా తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఇటీవల చైనా ప్రభుత్వ అనుబంధ పత్రిక ఒకటి గేమింగ్ పరిశ్రమపై విమర్శలు చేయడంతో పాటు ఇలాంటి గేమ్‌లను ఓ మత్తుమందుగా అభివర్ణించన జరిగింది.

 అంతే కాకుండా, గేమింగ్‌ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం తెలియ చేసింది. అయితే చైనా దేశం తీసుకున్న ఈ అనూమ్య నిర్ణ‌యాల వ‌ల‌ల్ గేమింగ్ రంగంపైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్స్ ఉంటుంద‌ని సాంకేతిక రంగానికి చెందిన నిపుణులు వివ‌రిస్తున్నారు. ఒక్క చైనా దేశంలోనే కాదండోయ్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న పిల్లలు గేమింగ్‌పై ఉంటుంద‌ని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా ప‌క్క‌నే ఉన్న మన దేశంలో కూడా కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ స‌మ‌యంలో పిల్ల‌లు ఎక్కువ‌గా ఈ గేమింగ్ ఇండస్ట్రీకి అల‌వాటు ప‌డ‌టంతో అది కాస్తా మ‌న ద‌గ్గ‌ర బాగా పెరిగినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదండోయ్ పెద్ద వారు కూడా ఈ వాడ‌కంలో పెరిగారని తెలుస్తోంది. ఏ ప‌ని లేక ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ప్ర‌జ‌లు ఎక్కువ‌గా టైమ్ పాస్ కోసం ఈ గేమ్స్ పట్ల ఎట్రాక్ట్ అవుతున్నార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: