తాలిబన్ల చేతిలో ఆ ఆయుధాలు.. పిచ్చోడి చేతుల్లో బాంబులు..?

Chakravarthi Kalyan
పిచ్చోడి చేతిలో రాయి.. ఈ నానుడి మనం చాలా సార్లు వినే ఉంటాం.. మూర్ఖుడి చేతిలో అధికారం అని చెప్పేందుకు ఈ నానుడి వాడతారు.. ఇది ఇప్పుడు తాలిబన్లకు సరిగ్గా సెట్ అవుతుంది. అమెరికా అధ్యక్షుడు జో జైడన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తాలిబన్లకు వరంగా మారుతున్నాయి. దశాబ్దాల తరబడి అఫ్గాన్ సైన్యాన్ని పోషించిన అమెరికా.. ఆ దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఆయుధాలు తరలించుకుపోకుండా ఇక్కడి సైన్యానికే వదిలేసింది. సైన్యానికి ఆయుధాలు అవసరమేగా అనుకోవచ్చు. కానీ.. అసలు ఆ సైన్యం పోరాడే స్థాయిలో ఉందా లేదా అన్న విషయం కూడా చెక్ చేసుకోలేదు.


ఏకంగా దేశ అధ్యక్షుడే పరారవడంతో సైన్యం కూడా ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే లొంగిపోయింది. అలా లొంగిపోవడంతో ఇప్పుడు తాలిబన్ల చేతికి అత్యాధునిక ఆయుధాలు సమకూరాయి. పైసా ఖర్చు చేయకుండానే మరింత శక్తిమంతులుగా మారారు. అవును మరి.. అమెరికా అఫ్గాన్ సైన్యానికి ఆయుధాల వివరాలు తెలిస్తే ఔరా అని ఆశ్చర్యపోతారు. అమెరికా వేసిన తప్పటడుగు కారణంగా ఇప్పుడు తాలిబన్ల వద్ద.. 167 హెలికాప్టర్లు, విమానాలు ఉన్నాయి.


ఉపగ్రహ చిత్రాల ఆధారంగా లెక్కవేసి ఈ లెక్కలు తేల్చారు. ఇవి కాకుండా ఇంకా హ్యాంగర్లలో ఉన్న వాటి లెక్క కలపలేదు. తాలిబన్‌ చేతికి 33 ఎండీ 530 హెలికాప్టర్లు వచ్చాయి. మరో 33 యూహెచ్‌-60 బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు వచ్చాయి. మరో 32 ఎంఐ-17 హెలికాప్టర్లు తాలిబన్లపరం అయ్యాయి. వీటికి తోడు ఏసీ 208 విమానాలు, ఏ-29 తేలికపాటి యుద్ధ విమానం, సీ-130 హెర్క్యూలెస్‌ మూడు వరకూ అందుబాటులో ఉన్నట్టు అమెరికా అంచనా వేసింది.


ఇక ఇవి కాకుండా దాదాపు 4 లక్షల వరకూ వివిధ రకాల తుపాకులు ఉన్నాయట. ఇవి కాకుండా ఇంకా 64వేల మిషీన్‌ గన్లు, 25వేల గ్రనేడ్‌ లాంచర్లు, 22 వేల హమ్వి వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయుధ సంపద చూసి తాలిబన్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరి ఈ తాలిబన్ల చేతిలో పడిన ఈ ఆయుధాలతో ఏం అనర్థాలు జరుగాతాయో అన్న ఆందోళన అనేక దేశాల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: