థర్డ్ వేవ్ కు పెరుగుతున్న కేసులే సంకేతమా..?

NAGARJUNA NAKKA
భారత్ లో థర్డ్ వేవ్ రానుందన్న నిపుణుల అంచనాల వేళ భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా 10వేల చొప్పున పెరిగాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 46వేల 164కేసులు నమోదయ్యాయి. రికవరీల కంటే కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మరో 607మంది చనిపోయారు. గత 24గంటల్లో 34వేల 159మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3లక్షల 33వేల 725కేసులున్నాయి. ఒక్క కేరళలోనే 30వేలకు పైగా కేసులొచ్చాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 58కోట్ల 7లక్షల 64వేల 210డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ ఉచిత పంపిణీలో భాగంగా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 51వేల 48లక్షల 970డోసులు పంపించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు, యూటీల దగ్గర 3కోట్ల 62లక్షల 24వేల 601టీకా డోసులు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇక దేశంలో కరోనా ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్టు కనిపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ సౌమ్యనాథన్ అన్నారు. జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే కొద్ది హెచ్చుతగ్గులతో కోవిడ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అకాశముందని చెప్పారు. సెప్టెంబర్ మధ్య నాటికి బయోటెక్ కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక బృందం ఆమోదం తెలిపే అవకాశముంది.

ఇక ఆందోళన గలిగించే విషయం ఏంటంటే.. కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16మంది నిర్వాసితులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో చిక్కుకున్న 78మందిని ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు.వారికి కరోనా పరీక్షలు చేయగా.. 16మందికి కరోనా ఉన్నట్టు తేలింది. అయితే వీరందరికీ ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు చెప్పారు. సెప్టెంబర్ మధ్యలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.















మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: