నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన రెండు సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా సంవత్సరం ప్రారంభం లోనే డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య తాజాగా ఈ సంవత్సరం చివరన అఖండ 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తాజాగా డిసెంబర్ 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.
ఇకపోతే డాకు మహారాజ్ మరియు అఖండ 2 రెండు సినిమాలకు కూడా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీ లలో బాలకృష్ణ నటించిన ఈ రెండు సినిమాలు కూడా నిలిచాయి. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.72 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , అఖండ 2 మూవీ 25.5 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాపట్టింది. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో ఓజి సినిమా 64.56 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానం లోనూ , హరిహర వీరమల్లు సినిమా 39.93 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానం లోనూ , గేమ్ చేంజర్ మూవీ 39.52 కోట్ల కలెక్షన్లతో నాలుగో స్థానంలో నిలవగా , డాకు మహారాజ్ 4 వ స్థానంలో , అఖండ 2 ఐదవ స్థానంలో నిలిచాయి.