అఖండ 2 : దేవుడిని, విశ్వ‌శ‌క్తిని నమ్మితే ఏం జ‌రుగుతుంది..?

RAMAKRISHNA S.S.
బాలకృష్ణ అఖండ‌లో దైవ‌త్వాన్ని లైట్‌గా ట‌చ్ చేసి వ‌దిలాడు బోయ‌పాటి. ఇప్పుడు సంపూర్ణంగా అఖండ శివుడి కోసం, సనాతన ధర్మం మీద సినిమాను న‌డిపించేశాడు.  "ఈ సినిమాలో లాజిక్ లేదు.. అఘోర స్థితికి చేరుకున్న అఖండ అంతమందిని ఒక్క శూలంతో చంపడం ఏంటీ, కామెడీ కాకపోతే" అనే మాటలు కొన్నిచోట్ల పాసివ్ గా వినిపిస్తున్నాయి. రుషులు.. విశ్వాన్ని నమ్మే వారు.. ప్రకృతిని పూజించే వారు. వారి ధ్యాన శక్తికి ప్రకృతికి మొత్తం కదిలి వచ్చేది. బల, అతిబల వంటి ఎన్నో సాధనలు ఉండేవి. వీటి గురించి తెలీని సమాజంలో, సాధన లేని సమాజంలో కనీసం ఇప్పటికైనా ఇలాంటి కొన్ని సినిమాల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక శక్తిని పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉంద‌న్న అభిప్రాయం ఇప్పుడు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. లాజిక్.. ఈ పదం చాలామంది తెగ వాడేస్తున్నారు. బ్రెయిన్ అంటే తెలీదు, బ్రెయిన్ ఎవల్యూషన్ అంటే తెలీదు.. లాజిక్ కి, కాగ్నిటివ్ కి కేంద్రస్థానమైన ప్రీ-ఫ్రాంటల్ కార్టెక్స్ ని దాటి.. విశ్వానికి, దైవ శక్తిని పూర్తిగా సరెండర్ అయితేనే సాకారం అయ్యే ఆల్ఫా, థీటా, గామా ( బీటా కాదు.. ఇప్పుడు లాజిక్ అనే వాళ్లందూ బీటా లో ఉంటారు ) బ్రెయిన్ వేవ్ ప్యాట్రర్న్ లలోకి మన రుషులు తమ సాధనతో వెళ్లి ప్రకృతిని సైతం ఆధీనంలోకి తెచ్చుకోగలిగారన్న విషయం తెలీని.. లాజిక్ అనే పదం వాడే వాళ్లని చూస్తే జాలి పడాల్సిందే అనే వాళ్లే ఉన్నారు.


అఖండలో ఒక విషయం ప్రస్ఫుటంగా ఉంటుంది.. దేవుడిని నమ్మితే.. విశ్వశక్తిని నమ్మితే అదే నిన్ను కాపాడుతుంది.. అన్న విషయం! లాజిక్ పేరు మీద ఇంగ్లీష్ వాళ్లు, అమెరికన్స్.. అందరూ మన బ్రెయిన్స్ ని హైజాక్ చేసి.. మన ఇంట్యూషన్ ని కాలరాసి, మనిషి విశ్వంతో కనెక్ట్ అవకుండా హైజాక్ చేశారు. ఇప్పుడు అదే పాశ్చాత్య సమాజం యూనివర్శల్ కాస్మిక్ ఫీల్డ్ ఇలాంటి వాటిని ప్రతిపాదిస్తోంది. సీక్రెట్ అని ఓ వెస్ట్రనర్ ఓ బుక్ రాస్తే ఇదే లాజిక్ గురించి మాట్లాడేవాళ్లు కోట్లాది మంది కొన్నారు..! ఈరోజు అఖండలో వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు అఖండ రూపంలో శివుడు ప్రత్యక్షం అవడం.. ఒక యోగి ఆత్మకధలో నిజంగా జరిగిన వృత్తాంతాలు. దీన్ని ఇప్పుడు ఇదే సైన్స్ క్వాంటమ్ టెలీపోర్టేషన్ అంటోంది! సో ఏ లాజిక్ కావాలి?


నిన్ను నువ్వు అర్పించుకుంటే.. ధర్మం కాపాడబడుతుంది అనేది సుస్పష్టం చేసిన అఖండ ని బాలకృష్ణ నచ్చక చూడకపోయినా.. లేదు, నాకు సైంటిఫిక్ గా లేదు, లాజిక్  లేదు అని చూడకపోయినా.. హ్యాపీగా ఇంట్లో కూర్చుని గడపొచ్చు.. కానీ మనం కోల్పోతున్న భారతీయ ధర్మం పట్ల కాస్తయినా గౌరవం వచ్చే అవకాశం కోల్పోయినట్లే.. సినిమా లాంటి మాస్ మీడియంలో ఇలాంటి సినిమా తీసిన బోయపాటిని, అంత హై ఎనర్జీ పెర్ ఫార్మెన్స్ ఇచ్చిన బాలకృష్ణని ప్రశంసించాల్సిందే!! సినిమాలో లీనమైన వారిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే హై ఎనర్జీ మూవీ!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: