జస్ట్ యెల్లో : సోషల్ మీడియాలో కూడా యాక్టివిస్టులు లేరా?
ఇప్పుడంతా డిజిటల్ మీడియా యుగం అయినప్పటికీ పెద్దగా లైవ్ లు ఇవ్వడాలు, మాట్లాడడాలు, జగన్ పార్టీని ఇరకాటంలో పెట్టే విమర్శలు చేయడాలి ఇలా ఇ న్ని పనులు ఉంటుండగా దేనిపైనా ఫోకస్ చేయడం లేదు తెలుగు తమ్ముళ్లు. ముఖ్యంగా వైసీపీ డిజిటల్ మీడియా కన్నా టీడీపీ డిజిటల్ మీడియానే చాలా వేగంగా పనిచేసేది. అధికారంలో ఉన్నప్పుడు ఓ 25 వెబ్సైట్లు అదే పనిగా ఏదో ఒకటి ఎఫ్బీలో పోస్టు చే సేవి. టీడీపీ అధికారం కోల్పోయాక చంద్రబాబు వాటి ఆర్థిక భారం మోయలేకపోయారు. నిర్వహణను చూసుకోలేకపోయారు. దీం తో ఎన్నో వెబ్సైట్లు మూతపడ్డాయి. తమ అకౌంట్లు క్లోజ్ చేసుకుని వెళ్లిపోయాయి. ఇదే సమయంలో కార్యకర్తలు కూడా సైలెం ట్ అయిపోయారు. సోషల్ మీడియా పోస్టులపై కూడా అభ్యంతరాలు ఉంటే న్యాయ స్థానాలను ఆశ్రయించవచ్చన్న నిబంధన కారణం గా వైసీపీ ఎక్కడిక్కడ సంబంధిత చర్యలు చేపట్టేందుకే మొగ్గు చూపింది.
పోలీసుల వేధింపులూ అదే స్థాయిలో ఉండడంతో ఎందు కు వచ్చిన గొడవ అని టీడీపీ కార్యకర్తలూ, సోషల్ మీడియా యాక్టివిస్టులూ డల్ అయిపోయారు. లోకేశ్ కూడా తనవైపు నుంచి కార్యకర్తలకు అందించే భరోసా ను ఏమీ ఇవ్వకపోవడంతో వైసీపీ అనుకున్న టార్గెట్ సులువు అయింది. ఇదే సమయంలో వైసీపీ డిజిటల్ వింగ్ యాక్టివ్ అవ్వడమే కాకుండా సంబంధిత యాక్టివిస్టులకు సాయిరెడ్డి నేతృత్వాన కొన్ని తరగతులు కూడా నిర్వహిం చారు. సోషల్ మీడియాలో వివాదాలకు దూరంగా పార్టీ చేపట్టే మంచి పనుల ప్రచారం విషయమై ఎలా మెలగాలి? ఎలా రాయాలి? అన్నవి నేర్పారు. దీంతో సోషల్ మీడియా పోస్టులలో కూడా మంచి భాష కానీ మంచి వివరాలు కానీ అదనంగా వచ్చి చేరాయి.
ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకనో పట్టించుకోవడం మానేసింది. ఐ టీడీపీ విభాగాలు కూడా జి ల్లాలలో పూర్తి స్థాయిలో మనసు పెట్టి పనిచేయడం లేదు అన్న విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నాయి. ఇక అగ్ర నేతలు కూడా సోషల్ మీడియాను లెక్క చేయడం లేదు. ట్విటర్ వేదికగా లోకేశ్ మినహా మిగతా నేతలు పెద్దగా మాట్లాడరు. లో కేశ్ కూడా కొన్ని సందర్భాల్లోనే తప్ప అన్ని వేళల్లోనూ స్పందించడం లేదు అన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు.