నిర్మల భారతం : ఇంతి బాధలు పట్టని ఇంటి కోడలు !

RATNA KISHORE
కొత్త కోడలు ఇంటికి వస్తే ఆనందిస్తాం. కోడలికి హారతులు పట్టి స్వాగతిస్తాం. ఇక్కడ కూడా అంతే! తెలుగింటి కోడలు పెద్ద,పెద్ద పద వులకు అర్హత పొందిన రోజున ఆనందిం చేం. బాగా పనిచేయాలని వేయి దండాలు దేవుడికి పెట్టుకున్నాం. మన కోడలికి తోటి మ హిళ కష్టాలే అర్థం కావడం లేదు. మిన్ను విరిగి నెత్తిన పడేలా ఉన్న ఈ ధరల ప్రభా వం ఎన్నాళ్లుంటుందో చెప్పలేం అనే అంటు న్నారు తప్ప  నియంత్రణకు తీసుకునే చర్యలను మాత్రం పాపానికి కూడా వివరించకపోవడం, ఆ దిశగా ఆలోచనలేవో చేయకపో వడం గతి తప్పిన ప్రగతికి తార్కాణం. సామాన్యులంతా పెరిగిన ధరలతో అప్పులు పుట్టక,జీతాలు చాలక నెత్తీ నోరూ మోదుకుం టుంటే పాపం! కేంద్రంలో ఉన్న పెద్దలు మా త్రం ఇవన్నీ తాత్కాలిక బాధలే అని మెట్ట వేదాంతం ఒకటి వినిపించి పోవడం ఇప్పుడు షరామామూలుగానే ఉంది.
ధరలు పెరిగినా
తగ్గినా ఇంటి కోడలిదే బాధ్యత
పెరిగితే సర్దుకు రావాలి
తగ్గితే పొదుపు చేసి రేపటికి ఇవ్వాలి
దేశ ప్రగతినీ,అభివృద్ధినీ నిర్ణయించే ఆర్థిక వ్యవస్థకు సారథి ఆమె. సాధికారత, పురోగతి అన్నవి లేకుండా కేవలం పై పై మాటలు మాత్రమే అన్నం పెడతాయా? కానీ పొంతన లేని మాటలో, ప్రకటనలో కారణంగా నిర్మలా సీతారామన్ అనే ఆర్థిక శాఖ మంత్రి మనల్ని నడి బజారున సమస్యలను పరిచయం చేస్తున్నారు. మార్కెట్ శక్తులు అన్నీ మో డీకి అనుకూలంగా ఉన్నాయా..అంటే  ఉంటే ఉంటాయి కానీ సామాన్యుడ్ని మాత్రం అవి అస్సలు చేరుకోలేకపోతున్నాయి అనే విమర్శ ఒకటి వినిపిస్తోంది. విసిగిస్తోంది.
ముందున్న ఆర్థిక సవాళ్లకు
ముందున్న పరిష్కారం లేని
ప్రశ్నలకు.. మోడీ ఏం చెప్తారో!
ఆర్థిక శాఖకు,రాష్ట్రాలకూ అస్సలు పడడ లేదు. నిర్మలా సీతారామన్ ఆ శాఖకు మంత్రి అయిన నాటి నుంచి సామాన్యుడి చేరువ అయ్యే లేదా దగ్గర అయ్యే నిర్ఱయాలే లేవు. కోవిడ్ ఎఫెక్ట్ ఒక్కటే సాకుగా చూపి ధరల బాదుడు మాత్రం తప్పని సరి చేస్తున్నారు.ఒక ఇంట్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ వాడకం దారులు ఉంటే అందరికీ అన్ని వడ్డనలూ ఇ వ్వడంలో ఆమెది మాత్రం పక్షపాతం లేని ధోరణి. ఎకానమిక్ క్లాసులకు ఒక్కసారి అయినా మేడమ్ హాజరయితే ఇంటి ఆడబిడ్డల కష్టాలేవయినా తెలుస్తాయి. మధ్య తరగతి నుంచి వచ్చిన ఈ తమిళియన్ ను ఆ వర్గం నుంచే ఎందుకు వ్యతిరేకత ఎదురౌతుందో అర్థం కావడం లేదు. గ్యాస్ ధరలు పెంచినా,పెట్రోలు ధరలు పెంచినా ఇవన్నీ దేశాభివృ ద్ధి కోసమే అన్న విధంగా ప్రకటనలు జారీ చేయడం ఏమంత సబబు కాదు. ఎనీవే హ్యాపీ బ‌ర్త్ డే మేడ‌మ్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: