తెలంగాణలో రాజకీయమంతా తికమక అవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకొని ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా ఆశించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మంచి చదువులు, రైతులకు సబ్సిడీలు, నీళ్లు నిధులు, ఇలా చాలా అంశాల మీద ముడిపడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దీంతో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి గత ఏడున్నర సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. మొదటి ఐదు సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన చేశాడు. రెండో సారి కూడా అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంలోనే అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ నాయకులు వచ్చుడే తప్ప, ఈ పార్టీ నుంచి బయటకు వెళ్లిన దాఖలాలైతే కనిపించడం లేదు.
కెసిఆర్ దాటికి ఏడున్నర సంవత్సరాల నుంచి మిగతా పార్టీలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అందరూ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమయంలోనే బీజేపీ పార్టీ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడంతో టిఆర్ఎస్ కు కొద్దిగా వణుకు పుట్టింది. ఈ సమయంలోనే దుబ్బాక ఎలక్షన్ లో రఘునందన్ రావు గెలుపొందడం టిఆర్ఎస్ ఓడిపోవడంతో కెసిఆర్ రాజకీయ మార్పు ఇంకా పెంచేశారు. తర్వాత తిరిగి నాగార్జునసాగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించారు. ఈ సమయంలోనే ఎవరు దిక్కు లేని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా రావడంతో రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోతున్నాయి. కెసిఆర్ ను ఎదురించ గల సత్తా రేవంత్ రెడ్డికి ఎక్కువ. దీంతో రేవంతు తమదైన శైలిలో రాజకీయం చేస్తూ రాబోవు రోజుల్లో పార్టీని గద్దె నెక్కించాలని చూస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈటల రాజేందర్ బిజెపి పార్టీలోకి పోవడం హుజురాబాద్ ఉప ఎన్నిక రావడం దీంతో రాష్ట్రం చూపంతా ఈ ఎన్నిక పైనే పడింది. ఈ ఎన్నికను కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా అక్కడ విజయం సాధించాలని అనేక పథకాలను అమలు చేస్తున్నాడు. దళిత బంధు పేరుతో ప్రతి దళిత ఇంటికి పది లక్షల రూపాయల ఇస్తామని హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు.
దీంతో తెలంగాణ మొత్తం ప్రజలంతా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. ఎందుకంటే హుజురాబాద్ ఒక్క దగ్గర ఇలాంటి పథకాలు పెడతారా. మేము ఓటు వేయ లేదా మాకు కూడా ఈ పథకాలు కావాలని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మీరు రాజీనామా చేస్తే మాకు ఈ పథకాలు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ మాదిరిగానే పరిగి మండలం లో ఒక యువ సర్పంచ్ ఏకంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. మా ఊరిలో ఒక్కో దళిత ఇంటికి 10 లక్షల రూపాయలు, 57ఏళ్ల వృద్ధులకు పింఛన్లు చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అందిస్తే సర్పంచ్ పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని పరిగి నియోజకవర్గంలోని దోమ మండలం దొంగ ఎంకేపల్లి గ్రామ సర్పంచ్ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు సవాల్ విసిరారు. హుజురాబాద్ లో అమలవుతున్న పథకాలు అన్ని మాకు కూడా అమలు చేయాలని సర్పంచ్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా , ఇక జీవితంలో సర్పంచ్ పదవికి పోటీ చేయనని అన్నాడు. దీంతో ఆ నియోజకవర్గంలో ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.