మరియమ్మకు ఐదు కోట్ల పరిహారం.. హైకోర్టులో విచారణ?

praveen
ఇటీవలే దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. ఈ ఘటనపై ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం మొత్తం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ లాకప్ డెత్ కి కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి.. ఇక నిర్ధారణ ఏంటో తెలుసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసారు.  ఖమ్మం జిల్లా మధిర గ్రామమైన చింతకాని కి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని అటు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ ఘటనపై స్పందించారు. అంతేకాదు ఇక మరియమ్మ కుమారుడు కుమార్తె కు ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందంటూ ముఖ్యమంత్రి హామీ సైతం ఇచ్చారు. 15 లక్షల ఎక్స్ గ్రేషియా ను కూడా ప్రకటించారు.

 ఇదిలా ఉంటే ప్రస్తుతం లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఇక నేడు ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ కు ఏకంగా 5 కోట్ల పరిహారం చెల్లించాలని హైకోర్టును కోరారు పిటిషనర్ విజయ వింద్యాల. ఈ పిటిషన్ పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది.  అదే సమయంలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ పై అటు ప్రభుత్వం హైకోర్టులో పూర్తి నివేదిక సమర్పించనుంది ఈరోజు.  అయితే మరియమ్మ మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.


 మరియమ్మకు రీపోస్టుమార్టం ఎందుకు చేయలేదు అంటూ పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు. ఈ క్రమంలోనే వెంటనే మరియమ్మకు రీపోస్టుమార్టం చేయాలి అంటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఒక ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది. అయితే ఒక దళిత మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి.  ఇక మరియమ్మ లాకప్ డెత్ పై ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నివేదికపై ఎలా స్పందించనుంది అన్నది  కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: