ఎంత దారుణం.. 10 ఏళ్ళ బాలికపై మైనర్ల దాష్టికం?

praveen
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా అటు ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి  ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేసి చంపిన... ఉరిశిక్షలు లాంటివి విధించిన అత్యాచార ఘటనలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు. దీంతో ఆడపిల్ల జీవితం కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతోంది  ఆడపిల్ల అర్ధరాత్రి భయం లేకుండా నడిరోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు గాంధీజీ. కానీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అర్ధరాత్రి కాదు కనీసం పట్టపగలు కూడా ఆడపిల్ల ధైర్యంగా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది.

 మానవత్వం ఉన్న మనుషులు కాస్త కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలుగా మారిపోతున్నారు. ఆడపిల్ల కనిపిస్తేచాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో సొంత వారు అనుకున్న వారు.. స్నేహితులు అనుకున్న వారే ఆడ పిల్లల పై అత్యాచారానికి పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తు సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం గా మారిపోయింది. అయితే నిందితుల్లో ఒకరు మాత్రమే మేజర్ కావడం గమనార్హం. మిగతా ఏడుగురు 18 ఏళ్లు కూడా నిండని వారే.

 ఈ దారుణ ఘటన హర్యానాలోని రాంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది   పదేళ్ల బాలిక ప్రస్తుతం మూడవ తరగతి చదువుతుంది. మే 24వ తేదీన ఆమె ఇంటి సమీపంలో ఉన్న పాఠశాలలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది కామాంధులు ఆ బాలికపై కన్నెశారు. బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు  అంతేకాదు అత్యాచారం చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ లో వీడియోలు సైతం రికార్డ్ చేశారు  అంతటితో ఆగకుండా ఇక ఈ వీడియోను ఒకరికొకరు వాట్సాప్ లో సైతం షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ వీడియో కాస్త  బయటికి రావటంతో అసలు విషయం బయటపడింది  ఈ క్రమంలోనే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: