ప్రజల ప్రాణాలు పోతుంటే.. వెంటిలేటర్ల పై రాజకీయమా?

praveen
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కరోనా వైరస్ పేరెత్తితే చాలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నాయకులు కరోనా వైరస్ విషయంలో కూడా మొదటి నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.


 మొదట దేశంలో వ్యాక్సిన్ కి అత్యవసర అనుమతి ఇచ్చిన సమయంలో పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ జరపకుండానే అటు కేంద్ర ప్రభుత్వం ఎంతో మంది ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెడుతూ వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చిందని.. వెంటనే వ్యాక్సిన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విమర్శలు చేసాయ్. అంతేకాకుండా వ్యాక్సిన్ పై ప్రజలలో అపోహలు, ఆందోళనలు పెరిగే విధంగా ప్రచార కూడా మొదలు పెట్టాయ్. ఇక ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసేందుకు సిద్ధమయ్యాయి ప్రతిపక్ష పార్టీలు. మరోసారి నీచ బుద్ధి చూపించాయ్.



 దేశంలో రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం  ఏకంగా 50 వేలకు పైగా వెంటిలేటర్ లను కొనుగోలు చేసింది. 30 వేలకు పైగా వెంటిలేటర్లు వివిధ రాష్ట్రాలకు చేరుకున్నాయ్. అయితే బీహార్,రాజస్థాన్, ఛత్తీస్గఢ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అసలు వెంటిలేటర్లు బయటకు తీయలేదని అసలు వాటిలో నాణ్యత లేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. పీఎం కేర్స్ వచ్చిన డబ్బులు అన్నింటిలో అక్రమాలకు పాల్పడుతూ నాణ్యతలేని వెంటిలేటర్లు పంపిణీ చేశారు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టాయి ప్రతిపక్ష పార్టీలు.



 ఇలా కాంగ్రెస్ ప్రచారం చేయగా.. ఇక ఇటీవలే చివరికి.. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ టోపీ  కేంద్ర ప్రభుత్వం పంపించిన వెంటిలేటర్ల పై క్లారిటీ ఇచ్చారు. పీఎం కేర్స్ పంపించిన వెంటిలేటర్ పై ఎక్కువ స్థాయిలో ఫిర్యాదులు లేవని.. ప్రస్తుతం వెంటిలేటర్లు వాడుకలోనే ఉన్నాయని.. వెంటిలేటర్లు పనికిరాకుండా పోవడం అంటూ ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కొన్ని చోట్ల వెంటిలేటర్ను భద్రంగా ఉంచడంలో చిన్నచిన్న లోపాలు ఉన్నప్పటికీ..  ప్రస్తుతం చాలా వెంటిలేటర్లు వాడుకలోనే ఉన్నాయని కొన్ని  వెంటిలేటర్లనూ మాత్రం భద్ర పరిచినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: