సైలెంట్ గా నే పని కానిచ్చేస్తున్న జగన్ పార్టీ.. బాబుకు షాక్ తప్పదా..?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం తిరుపతి ఉప ఎన్నిక చుట్టే తిరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం లోని ఏడు నియోజకవర్గాల్లో కూడా ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులకు అందరిని ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు.

 ఈ క్రమం లోనే అన్ని పార్టీలు కూడా ఒక్కో అంశాన్ని తమ ఆయుధం గా మార్చుకుంటూ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం లో దూసుకు పోతున్నాయి. ప్రస్తుతం టిడిపి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెచ్చి  జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అటు బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా గురించి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా అంశం పై వైసిపి వ్యవహరిస్తున్న వ్యూహం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడా లేవనెత్తకుండా వైసిపి సైలెంట్గా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం లో గేమ్ నడుపుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకు రాకుండానే ప్రచారం నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు. కేవలం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు..  పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న లబ్ధి గురించి ప్రజలందరికీ తెలియ జేస్తూ ఓటర్ మహాశయులకు తమ వైపుకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది అధికార వైసీపీ పార్టీ. ఇలా ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం ఎంతవరకూ  ఓటర్లను ప్రభావితం చేస్తుంది అన్నది ఎన్నికల ఫలితాలలో తేలుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: