జగమంత జగన్‌: మిడతల దండులా మీదపడ్డా ఎదిరించి గెలిచేస్తున్నాడా?

ప్రత్యర్థులు గుంపుగా వచ్చినా జగన్‌దే జయం

జగన్‌ను నెత్తిన పెట్టుకున్న సీమ, ఉత్తరాంధ్ర

110- 120 పక్కా గెలుస్తామంటున్న వైసీపీ


ఏపీలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఈసీ పోలింగ్‌ శాతం లెక్కలు తేల్చేపనిలో పడిపోయింది. పార్టీలన్నీ ఎక్కడ తమ పార్టీ పైచేయిగా ఉంది.. ఎక్కడ డౌన్‌ అయింది అంటూ లెక్కలు వేసుకుంటున్నాయి. పార్టీల అభిమానులు గెలిచేది తమ పార్టీయే అంటూ ఊహల విహారం చేస్తున్నారు. మరి ఈ హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిది.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. చూద్దాం..



వైసీపీ, కూటమి మధ్య నువ్వా నేనా అన్నంత పోటీ ఉండటం.. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే గెలుపుని దీమా వ్యక్తం చేస్తుండటంతో గెలిచేది ఎవరో విశ్లేషకులు కూడా ఒకటికి రెండు సార్లు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే.. ఎంత పోటీ ఉన్నా.. బరిలో ఎంత మంది జట్టుగా దిగినా.. గెలుపు మాత్రం జగన్‌దే అన్నది ఎన్నికల తీరును నిశితంగా పరిశీలించిన వారు చెబుతున్నమాట.



ఈసారి ఏపీలో ఎన్నికలు జరిగింది ఎవరెవరి మధ్య..? కేవలం జగన్‌, చంద్రబాబు మధ్యే కాదు. ఈసారి ఎన్నికలు జరిగింది ఒకే ఒక్క జగన్‌కూ... మిడతల దండులా జట్టు కట్టిన చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరికీ మధ్య.. అంతేనా.. ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో జట్టు కట్టింది కేవలం కూటమి పార్టీలే కాదు.. ఎల్లోమీడియాగా పేరున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా. ఇలా అంతా మిడదల దండులా మీద పడిపోయినా.. ఒకే ఒక్కడుగా నిలిచి జన రణ క్షేత్రంలో అందరినీ ఎదురొడ్డి నిలిచిన జగన్‌ గెలవబోతున్నాడని ఇండియా హెరాల్డ్‌కు అందుతున్న క్షేత్ర స్థాయి సమాచారం.


వైనాట్‌ 175.. ఇదీ ఎన్నికలకు ముందు జగన్ పదే పదే చెప్పిన మాట. తన పార్టీ శ్రేణులకు జగన్ పెట్టిన టార్గెట్‌ ఇది. అయితే.. అంత సీన్‌ లేకపోయినా.. మెజారిటీ మార్కును వైసీపీ అత్యంత సులభంగా దాటేస్తుందన్నది ఇండియా హెరాల్డ్‌కు ఫీల్డ్‌ నుంచి అందుతున్న సమాచారం. 110 నుంచి 120 సీట్ల వరకూ వైసీపీ అవలీలగా గెలవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 - 120 సీట్లు తప్పకుండా గెలుస్తామన్న దీమా వైసీపీ వర్గాల్లోనూ కనిపిస్తోంది.



ప్రాంతాలవారీగా చూస్తే తనకు పెట్టని కోట లాంటి రాయలసీమ జిల్లాలతోపాటు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడులోనూ వైసీపీ జోరు కనిపించింది. ఇక ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నంలోనూ ఆ పార్టీ నేతలు సత్తా చాటారు. కూటమి ప్రభావంతో గోదావరి, కృష్ణా, గుంటూరులో కొంత ప్రతికూలత ఎదురైనా కంఫర్టబుల్‌ మెజారితో జగన్ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమన్నది ఇండియా హెరాల్డ్‌కు అందుతున్న క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: