తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ట్
డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో
సుకుమార్ ఒకరు. ఈయన
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన
ఆర్య మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ
మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇక ఆ తర్వాత కూడా ఈయన ఎన్నో
బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించడంతో ప్రస్తుతం ఈయన
టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
ఇకపోతే చాలా మంది జనాలు
సుకుమార్ ఎవరి దగ్గర పని చేయలేదు అని , నేరుగా
ఆర్య సినిమాకు దర్శకత్వం వహించాడు అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే అది నిజం కాదు.
ఆర్య మూవీ కంటే ముందు
సుకుమార్ ఓ స్టార్
డైరెక్టర్ దగ్గర ఓ సినిమాకు పని చేశాడు. ఆ విషయాన్ని కొన్ని రోజుల క్రితం
సుకుమార్ అధికారికంగా ప్రకటించాడు. ఓ
ఈవెంట్ లో భాగంగా
సుకుమార్ మాట్లాడుతూ ... చాలా మంది నేను ఏ సినిమాకు పని చేయలేదు అని , నేరుగా
ఆర్య మూవీ కి డైరెక్షన్ చేశాను అని అనుకుంటారు. అది నిజం కాదు. నేను
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి
వి వి వినాయక్ దగ్గర రైటర్ గా పని చేశాను.
ఆయన నితిన్
హీరో గా
దిల్ మూవీ ని రూపొందిస్తున్న సమయంలో వినాయక్ దగ్గర నేను రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేశాను. ఆ సమయం లోనే
దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడింది. ఆ సమయం లోనే
ఆర్య మూవీ కథను అతనికి చెప్పడం, ఆ కథ అద్భుతంగా నచ్చడంతో
ఆర్య సినిమా రూపొందింది అని అలా
దిల్ సినిమా సమయంలో నేను వినయ్ గారి దగ్గర పని చేసి చాలా విషయాలు నేర్చుకున్నాను అని
సుకుమార్ తాజాగా చెప్పుకొచ్చాడు.