షాక్: విడాకులు తీసుకున్న హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
ప్రముఖ సంగీత డైరెక్టర్ ,హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమా రిజల్ట్ తో పని లేకుండానే వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు.. కనీసం ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఉంటారు హీరో జీవి ప్రకాష్.. కొన్ని చిత్రాలలో తన నటనతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయాయి. అయితే తాజాగా జీవి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలాన్ని రేపుతోంది..
అదేమిటంటే సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి అనేది కామన్ గా మారుతూ ఉంటుంది.. నచ్చితే కొద్ది రోజులు డేటాని తిరుగుతారు ఇష్టమైతే వివాహం చేసుకుంటారు. లేకపోతే ఎవరి దారిన వారు చూసుకుని ముందుకు వెళుతుంటారు. ఒకవేళ వివాహం అయిన తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు..ఇటీవల హీరో ధనుష్ కూడా విడాకులు తీసుకోక సమంత, నాగచైతన్య .. నిహారిక తదితర సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వీరి బాటనే నటుడు జీవి ప్రకాష్ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

హీరో జీవి ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు దీనిపైన అధికారికంగా ప్రకటన ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ఎంతో ఆలోచించం చివరికి విడిపోవాలనుకునే విషయాన్ని తీసుకున్నామంటూ తెలిపారు..తాను సైంధవి పరస్పర అంగీకారంతోనే ఈ విడాకులు తీసుకున్నామని మా నిర్ణయాన్ని మీడియా మిత్రులు అభిమానులు సైతం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే మా ప్రైవసీకి గౌరవం ఇస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు జీవి ప్రకాష్.. మా నిర్ణయం ఇద్దరికీ మంచిదని భావించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు జీవీ ప్రకాష్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. మరి నా అభిమానులు ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: