బాహుబలి వివాదంలో.. నారా బ్రహ్మణి.?

Chakravarthi Kalyan
ఒక్కోసారి అభిమానులు చూపే అత్యుత్సాహం సెలబ్రెటీలకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. లేటెస్టుగా చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా అలాంటి వివాదంలోనే చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంతో ఏమాత్రం సంబధం లేని ఆమె ప్రభుత్వానికి అందాల్సిన సొమ్మును మామగారి తరపున తీసుకోవడమే ఆ వివాదానికి అసలు కారణం. 

అసలు విషయం ఏమిటంటే.. వారాహి చిత్ర నిర్మాణ సంస్థ అదినేత కొర్రపాటి సాయి రాజధాని నిర్మాణం కోసం విరాళం ఇవ్వదలచుకున్నారు. అందుకోసం కృష్ణాజిల్లాలోని 30 ధియేటర్లలో సినిమా విడుదలకు ఒక రోజు ముందే బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు. అలా ప్రదర్శించగా దాదాపు పాతిక లక్షల రూపాయల సొమ్ము సమకూరింది. 

చెక్కుతో వచ్చిన చిక్కులు.. 


ఆ సొమ్మును బాహుబలి టీమ్ రాజధాని కోసం ఇవ్వదలచుకుంది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ సొమ్ము చెక్కును చంద్రబాబుకో... కనీసం ఏవరైనా ప్రభుత్వంలోని మంత్రికో ఇచ్చి ఉండాల్సింది. కానీ విచిత్రంగా రాజధాని కోసం ఇవ్వాల్సిన చెక్కును ముఖ్యమంత్రి కోడలు నారా బ్రహ్మణికి అందజేశారు. 

ప్రభుత్వం తరపున అందుకోవాల్సిన చెక్కును నారా బ్రహ్మణి ఏ హోదాలో అందుకుంటారని విపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అంటే చంద్రబాబు కుటుంబమేనా అని వారు లాపాయింట్ లాగుతున్నారు. ఎవరి చేతికి ఇచ్చామన్నది కాదన్నయ్యా.. చెక్కు ఎవరి పేరు మీద ఉందన్నదే ప్రధానమని బాహుబలి టీమ్ సమర్థించుకుంటోంది. సాయం చేయడంలోనూ విమర్శలు చేయడమంటే కోడి గుడ్డుపై ఈకలు పీకడమే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: