ఈ నిమ్మగడ్డకు ఏమైంది.. చంద్రబాబు పూర్తిగా డిజప్పాయింట్‌..?

Chakravarthi Kalyan
నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్.. గతంలో ఇంతగా ఏ ఎన్నికల అధికారీ ప్రాచుర్యం పొందలేదు. వార్తల్లోకి ఎక్కలేదు. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ఈ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మొదట్లో టీడీపీకి ఫుల్ ఫేవరేట్ అయ్యాడు. కానీ ఆ క్లైమాక్స్ కు వచ్చేసరికి ఇదే నిమ్మగడ్డ చంద్రబాబు అండ్ టీమ్‌ను పూర్తిగా డిజప్పాయింట్‌ చేసేశారు. ఎందుకంటే.. ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ అధికార దుర్వినియోగం చేసిందని టీడీపీ అంటుంటే.. అబ్బే లేదు.. లేదు.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ప్రకటించారు.
అంతేకాదు.. ఆ తర్వాత టీడీపీ ఇచ్చిన అనేక ఫిర్యాదులపైనా ఆయన పసలేదని తేల్చేశారు. పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించామంటున్న నిమ్మగడ్డ..కౌంటింగ్ ప్రక్రియలో రెండంకెల ఫలితాలు వచ్చిన చోట కొన్ని తప్పులు జరిగాయని కంప్లైంట్లు వచ్చాయని.. కానీ.. అవేవీ నిజం కాదని తమ విచారణలో తేలిందని ప్రకటిస్తూ టీడీపీని పూర్తిగా డిజప్పాయింట్ చేసేశారు. కంప్లైంట్లపై కలెక్టర్లు, జిల్లా ఎలక్షన్ అధికారుల నుంచీ వివరణాత్మక నివేదికలు తెప్పించామని నిమ్మగడ్డ అంటున్నారు.
ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ముఖ్యంగా నాలుగు చోట్ల కంప్లైంట్లపై రెండవసారి కూడా లోతుగా విచారణ చేశామని.. కలెక్టర్లు ఇచ్చిన వివరణలను ఎస్ఈసీ అంగీకరించిందని నిమ్మగడ్డ ప్రకటించారు. గుంటూరు జిల్లాలో పిడపర్తిపాలెం, వెనిగండ్ల, పెదకూరపాడు, పోతుమర్రు పంచాయితీల కంప్లైంట్ల విషయంలో పూర్తి సమాచారం సేకరించామన్నారు. రీపోలింగ్ నిర్వహించాల్సిన స్ధాయిలో తీవ్రమైన సంఘటనలు ఏవీ జరగలేదని తేల్చి చెప్పారు.
పూర్తి విచారణ అనంతరం ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగలేదని ఎస్‌ఈసీ ధృవీకరిస్తోందని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. అంటే.. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు,71 మునిసిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా.. ఎలాంటి అక్రమాలు జరగకుండా  ముగిశాయని ఆయన ప్రకటించడమే కదా. చిన్నపాటి ఘటనలు మినహా ఎక్కడా తీవ్రమైన ఘటనలు చోటు చేసుకోలేదన్న  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ప్రకటనతో టీడీపీ శ్రేణులు ఎంతగా ఆవేదన చెంది ఉంటాయో..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: