అఖండ 2 లో హీరోయిన్ గా ఆ సీనియర్ బ్యూటీ..!?

Anilkumar
నందమూరి నట సింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య యంగ్ హీరోలకి పోటీగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు మరొక సినిమాతో బిజీ కానున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. ఆఖండ వంటి బ్లాక్ పాస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలయ్య ఈ మూవీకి సీక్వెల్ కూడా చేయబోతున్నట్లుగా ప్రచారం

 చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. బోయపాటి శ్రీను ఇప్పటికే స్టోరీ కూడా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ బాలయ్య మాత్రం దానికి డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు అని అంటున్నారట. అందుకే దీనికి సంబంధించిన షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బాలయ్య డేట్స్ ఇస్తే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా అఖండ కి కొనసాగింపుగా ఉంటూనే కొత్తదనాన్ని కూడా తెస్తుంది అని అంటున్నారు.

 ఇకపోతే అఖండ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మరి పార్ట్ 2 లో కూడా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కానీ హీరోయిన్ కి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో భూమిక ను హీరోయిన్ గా ఫిక్స్ చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. ఇక కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో బాలకృష్ణ తో నటించే అవకాశం రాలేదు కానీ ఇప్పుడు మాత్రం బాలయ్యతో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది భూమిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: