విశాఖ - అనకాపల్లి: వైసీపీ తుక్కు తుక్కు అయిందిగా?

Purushottham Vinay
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి.ఈ 3 పార్టీల మధ్య పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు కూడా పూర్తయ్యింది. ఇందులో భాగంగా అనకాపల్లి సీటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి దక్కింది... దీంతో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బరిలోకి దిగడం జరిగింది.ఈ అనకాపల్లి నియోజకవర్గంలో టిడిపి పార్టీ బలంగా వుంది. ఆ పార్టీ ఆవిర్బావం (1983) నుండి 2004 దాకా ఇక్కడ టిడిపిదే విజయం. తొలి సారి రాజా కన్నబాబు టిడిపి తరపున పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత దాడి వీరభద్రరావు (1985,1989, 1994, 1999) వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఆఖరి సారిగా 2014 లో పీలా గోవింద సత్యనారాయణ టిడిపి నుండి పోటచేసి గెలిచారు. 2019 లో వైఎస్ జగన్, వైసిపి హవాతో గుడివాడ అమర్నాథ్ గెలిచారు. ఇదిలా వుంటే ప్రస్తుత జనసేన అభ్యర్థి అయిన కొణతాల రామకృష్ణ 2004లో ఇదే అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచారు.


ఇంకా అలాగే 2009 లో గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి గెలిచారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,05,573, పురుషులు - 1,00,717 ఉండగా మహిళలు - 1,04,839 ఉన్నారు.అనకాపల్లి సీటు విషయంలో అధికార వైసిపి సంచలన నిర్ణయమే తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రమే కాదు మంత్రిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్ ను పక్కనబెట్టి మలసాల భరత్ కుమార్ కు అనకాపల్లి టికెట్ ఇచ్చారు. ఇక అమర్నాథ్ ను మరో నియోజకవర్గానికి షిప్ట్ చేసారు. అలాగే ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ అనకాపల్లిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే వున్నా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది.తెలుస్తున్న సమాచారం ప్రకారం కోణతాల ముందంజలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: