టీ20 స్కోర్ లా గత రికార్డుని బద్దలు కొట్టేస్తారా..?

Divya
టి20 ప్రపంచ స్థాయి క్రికెట్ పోటీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగితే సార్వత్రిక ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు టి20 స్కోర్ గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు ఆటగాళ్లు.. అయితే ఇప్పుడు టీ 20 లాగానే ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెడుతున్న కొత్త ప్రభుత్వం కూడా గత రికార్డ్ లను బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్న విషయం తెలిసిందే.  మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ పోటీ మరింత హోరాహోరీగా సాగింది.. 175 స్థానాలలో అధికార పార్టీ వైసిపి పోటీ చేయగా.. 144 స్థానాలలో టిడిపి , 21 స్థానాలలో జనసేన,  10 స్థానాలలో బిజెపి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.. వై నాట్ 175 అంటూ అధికార పార్టీ వైసిపి ధీమా వ్యక్తం చేయగా.. ఒంటరిగా పోటీ చేస్తే తాము గెలవలేమని భావించిన టిడిపి.. జనసేన,  బిజెపితో పొత్తు పెట్టుకుని ఊహించని విధంగా గత రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ దూసుకుపోతోందని చెప్పవచ్చు..
ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాలలో ఫలితాలు పూర్తికాకముందే.. తొలి ,, రెండు, మూడు రౌండ్లలో ఆధిక్యత సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు కూటమి అభ్యర్థులు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ 16 సీట్లలో ముందంజలో ఉండగా..  టిడిపి 132, జనసేన 20, బిజెపి 7 సీట్ల ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇక కూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీలను కలిపితే సుమారుగా 159 సీట్లు ఒక కూటమికి రాబోతున్నాయని సమాచారం..  ఇక గత ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం 151 సీట్లతో రికార్డు సృష్టిస్తే ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కూటమి మరింతగా ముందుకు దూసుకుపోతోంది. ఏది ఏమైనా 2024 ఎన్నికలలో కూటమి భారీ అఖండ విజయంతో గెలవబోతోందని చెప్పవచ్చు. ఇకపోతే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే. ఇక మొత్తానికైతే తాజా ఫలితాలను చూస్తూ ఉంటే టి20 లాగా గత రికార్డులను బ్రేక్ చేయబోతోంది కూటమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: