హిందూపురం: 12 రౌండ్లు.. లీడ్ లో బాలయ్య.. సైకిల్ దెబ్బకు ఫ్యాన్ గిరగిర..!

Divya
శ్రీ సత్య సాయి జిల్లాలో హిందూపురం నియోజకవర్గం అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే.. టిడిపి కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఈసారి ఎలాగైనా సరే తమ వశం చేసుకోవాలని వైసిపి శాయ శక్తుల ప్రయత్నించింది.. కానీ తాజాగా వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే ప్రస్తుతం 12 రౌండ్లు ముగిశాక... టిడిపి అభ్యర్థి బాలక్రిష్ణ లీడ్ లో ఉన్నట్లు సమాచారం.. ఇక వైసిపి అభ్యర్థిగా బాలకృష్ణకు పోటీగా దీపిక బరిలోకి దిగగా.. మరొకవైపు ఓట్లను చీల్చడానికి పరిపూర్ణానంద స్వామి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు..
ఇక అలా స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి,  మరొకవైపు వైసీపీ అభ్యర్థిగా దీపిక ఇద్దరూ కూడా పోటాపోటీగా బాలకృష్ణతో పోటీపడినా..  ఏమాత్రం ఆయన ముందు నిలవలేకపోయారు.. దాదాపు 12 రౌండ్లు లో కౌంటింగ్ పూర్తి చేయగా ఈ 12 రౌండ్లలో కూడా వీరిద్దరి కంటే ఆదిక్యంతో బాలకృష్ణ దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం హిందూపురంలో బాలయ్య మరొకసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఇక హ్యాట్రిక్ తో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు బాలయ్య అంటూ అప్పుడే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మొత్తానికి అయితే ఎలాగైనా సరే విజయం సాధించాలని భారీగా పోటీపడిన బాలకృష్ణ అనుకున్నట్టుగానే గెలుపొందబోతున్నారు అని తెలుస్తోంది. మరి హ్యాట్రిక్ కొట్టి అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న బాలకృష్ణ అసెంబ్లీలో ఏ విధంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారో చూడాలి అంటూ టిడిపి శ్రేణులు చర్చించుకుంటున్నారు.. ఇకపోతే టిడిపి వైసిపి తాజాగా వెలువడిన ఫలితాలలో ఎంపీ సీట్లలో వైసీపీ 4 సీట్లలో ఆధిక్యంలో  ఉండగా , టిడిపి 11 సీట్లలో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇక ఎమ్మెల్యే సీట్లలో వైసీపీ 16 సీట్లలో  ఆధిక్యంలో ఉండగా టిడిపి 159 సీట్లతో ఆదిక్యం కనబరుస్తూ విజయ పతాకం ఎగరవేయబోతోంది. మొత్తానికైతే సైకిల్ దెబ్బకు ఫ్యాన్ గిరగిర తిరిగి తట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: