స్వర్ణ దేవాలయం గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!?

Suma Kallamadi
గోల్డెన్ టెంపుల్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే మీకు గోల్డెన్ టెంపుల్ గురించి తెలియని విషయాలు చాల ఉన్నాయి. అయితే ఆవు ఏంటో ఒక్కసారి చూద్దామా. అమృత్ సర్ ఆలయంలో సిక్కుల పవిత్ర గ్రంధం అయిన ఆది గ్రంధం ఉంచుతారు. దీనిని ప్రతి రోజూ ఉదయం చదువుతారు. సరస్సులోని ఒక వంతెన ద్వారా దీనిని చేరాలి. సాంప్రదాయ దుస్తులు ధరించిన రక్షక భటులు దీనిని కావలి కాస్తూ వుంటారు.
అయితే గురుద్వారాలోని పై అంతస్తులను 400 కిలోల బంగారంతో నిర్మించారు. అందుకనే దీనిని గోల్డెన్ టెంపుల్ లేదా స్వర్ణ దేవాలయం అంటారు. దీనిలో 'గురు గ్రంధ సాహిబ్' అనబడే ఒక పవిత్ర గ్రంధం వుంటుంది. మహారాజా రంజిత్‌ సింగ్‌ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరవాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయం స్వర్ణదేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది.
ఇక అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ జాబితాలో నామినేట్‌ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ భవనానికి ఎదురుగా సిక్కు మత చరిత్రను తెలిపే ఒక మ్యూజియం కలదు. గురుద్వారా ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద విక్టోరియన్ క్లాక్ టవర్ ఉంటుంది. భక్తులు టెంపుల్ లోకి వెళ్ళే ముందు తమ పాదాలను ఇక్కడ కల ఒక నీటి మడుగు లో శుభ్రపరచు కుంటారు.
సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. ధాబా పేరు కేసర్‌ దా ధాబా. గోల్డెన్‌ టెంపుల్‌కి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇది వందేళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లాచ్చా పరాఠా, దాల్‌ మఖానీ కోసం లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా వందేళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్‌ మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్‌లోని షేక్‌పురాలో మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: