కాలుష్యంతో గుండెపోటు, పిరితిత్తులే కాదు.. దానికి కూడా ముప్పు ఉంది..?

praveen
ఈ మధ్యకాలంలో వాహనాల వాడకం రోజురోజుకు పెరిగి పోయింది.  కేవలం వాహనాల వాడకం మాత్రమే కాదు అటు ఎన్నో కాలుష్యాన్ని కలిగించే కంపెనీలు కూడా పుట్టుకొస్తున్న తరుణంలో రోజురోజుకు వాయు కాలుష్యం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇక నాణ్యమైన గాలి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో కాలుష్య పూరిత గాలి పీల్చుకుంటూ ఎంతో మంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రోజురోజుకు కలుషితం గా మారుతున్న గాలి వల్ల గాలిలో కనీస నాణ్యత లోపించడంతో చివరికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి అనే విషయం తెలిసిందే.

 అయితే  పర్యావరణాన్ని రక్షించాలి అని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి ఎక్కడ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ఇప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పూర్తిగా సహజ వనరులు కాలుష్యం జరిగేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వాహనాల వాడకం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో గాలి కాలుష్యం విపరీతంగా జరిగిపోతుంది. అయితే గాలి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, గుండెకు సమస్యలు ఏర్పడతాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో గాలి కాలుష్యం కారణంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఇటీవలే వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గాలి కాలుష్యంతో  ఊపిరితిత్తులు, గుండెకు మాత్రమే కాదు కళ్లకు కూడా ఎంతో చేటు అంటూ సూచించారు. గాలి కాలుష్యం కారణంగా కంటి చూపుకోల్పోయే ప్రమాదం ఉందని ఎప్పటికీ తిరిగి రాదు అంటూ హెచ్చరించారు శాస్త్రవేత్తలు. దృష్టి లోపం లేని 1.15 లక్షల మందిని వివిధ కాలుష్య పరిమితులలో పరిశీలించగా వారు చూపు కోల్పోయే  ఆస్కారం ఉంది అనేది బయటపడింది అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: