తెలివైన దొంగ.. సినిమాటిక్ అబద్ధం.. కానీ చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో దొంగల బెడద రోజురోజుకి పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎంతో నమ్మకంగా ఉంటున్న వారే  చివరికి దొంగతనాలకు పాల్పడుతూ షాక్  ఇస్తూ అందినకాడికి దోచుకో పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేస్తున్న పని మనుషులే సరైన సమయం చూసి ఇల్లు గుల్ల చేస్తున్న ఘటనలు కొన్ని తెరమీదికి వస్తూ ఉంటే  పక్కింట్లోనే ఉంటూ సరైన సమయం కోసం చూసి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది...  సాధారణంగా సినిమాల్లో ప్రేక్షకులకు కామెడీని పంచడానికి..  దొంగతనం చేసి మళ్లీ ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వాళ్ళు దొంగా దొంగా అని అరవడం లాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ  మహిళ ఎదురింట్లో దొంగతనం చేసింది. ఇక ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగిందిఅని ప్రచారం చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.  కానీ చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో విచారణ చేపట్టడం తో అసలు విషయం బయట పెట్టింది.


 మార్కాపురం బెస్తవారిపేట  లో ఘటన జరిగింది. బెస్తవారిపేట కు చెందిన చిన్నపాటి ఆదినారాయణ డ్రైఫ్రూట్స్ వ్యాపారంలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు.  ఈనెల 12వ తేదీన భార్యతో కలిసి వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. అదే సమయం లో ఎదురింటి లో నివాసముండే ఓ మహిళ.. మా ఇంట్లో మీ ఇంట్లో దొంగతనం జరిగింది అంటూ ఆదినారాయణ కు చెప్పింది.  ఆదినారాయణ ఇంట్లో చెక్ చేయగా నగలు పోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు.  ఈ క్రమంలోనే ఎదురింటి మహిళపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిజం బయటపడింది. ఇక మహిళా దగ్గరి నుంచి దొంగిలించబడిన మొత్తాన్ని రికవరీ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: