ప్రతికూల పరిస్థితుల్లోనూ టీ ఆర్ ఎస్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం..?

P.Nishanth Kumar
టీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ఇదే సమయంలో బీజేపీ బలపడడం కూడా కేసీఆర్ కి ప్రతికూలించే అంశం..
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. తమ విధానాలతో టీ ఆర్ ఎస్ పార్టీ కి ఎక్కువపోట్టిన వారి టార్గెట్ తో కాంగ్రెస్ కకావికలం అయిపొయింది.  అయితే ఇక్కడే కాకుండా మరికొన్ని చోట్ల కూడా బీజేపీ ప్రధానంగా బలపడుతుంది.. ఈనేపథ్యంలో దేశంలో ఒకే పాలనా, ఒకే ఎన్నిక విధానం అమలుపరిచే విధంగా మోడీ జమిలీ ఎన్నికల సిగ్నల్ ఇస్తున్నారు..దాంతో అన్ని పార్టీ లు ఆ విధంగా ముందుకు దూసుకుపోతుంది. తెరాస కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సిద్ధమయిందని.. మనం కూడా దానికి తగ్గట్లుగా సిద్ధం కావాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ పిలుపునిచ్చారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యే్లతో మాట్లాడారు. ఫలితాలు అనుకున్నంతగా రాలేదని కంగారు పడాల్సిన పనేమీ లేదని.. గ్రేటర్‌లోఈ సారి భావోద్వేగ ఎన్నికలు జరిగాయన్నారు. మన ప్రయత్నంలో లోపం లేదని అయితే.. మరింత మంది సిట్టింగ్‌లను మార్చాల్సి ఉందన్నారు. సిట్టింగ్‌లను మార్చిన దగ్గర గెలిచామన్నారు. ఇక్కడే మన లెక్క తప్పిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని.. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని కేటీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: