బాబ్జి.. బాబు గారు బాగా బిజీ.. ట్రాఫిక్ పోలీసులు ఇంట్రెస్టింగ్ ఫోటో..?
అయితే ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడు కోవాలి అని ఎన్నిసార్లు సూచించినప్పటికీ వాహనదారులలో రోజురోజుకు నిర్లక్ష్యం పెరిగి పోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. కనీసం ద్విచక్రవాహనంపై వెళ్లేవారు హెల్మెట్ కూడా పెట్టుకోరు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు అని తెలిసింది అంటే చాలు వాళ్ల చేతికి చిక్కకుండా షార్ట్ కట్ రూట్ లో తప్పించుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ పోలీసులు చెప్పేది మన ప్రాణాలు కాపాడుకోవడానికి కదా అన్న విషయాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఎంతో వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ఫోటో ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇటీవలే హైదరాబాద్లో ఓ వ్యక్తి బైక్ నడుపుతూ వాటర్ బాటిల్ తో నీళ్లు తాగుతున్న ఫోటో ని క్లిక్ మనిపించారూ ట్రాఫిక్ పోలీసులు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అంతేకాదండోయ్ ఈ ఫోటోకి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. బాబ్జి బాబు గారు బాగా బిజీ.. నీళ్ళు తాగడానికి కూడా బైక్ ఆపలేనంత బిజీ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు భారీ జరిమానా కూడా విధించారు..