ఏపీ: ఓట్ల కోసం.. కొత్తగాళం వేస్తున్న పార్టీ నేతలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల హడావిడి రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా అభ్యర్థులు డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు.. ఇప్పుడు తాజాగా డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో ఒక కొత్త పద్ధతి వచ్చింది. అదేమిటంటే యూపీఐ ట్రాన్సాక్షన్.. ద్వారా డబ్బులు కూడా పంచారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే అప్పుడే పంచడం ఏంటి అనుకుంటే.. మెయిన్ ఎన్నికలకు కాదంట.. కేవలం పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల కోసమే ఉద్యోగులు వేసే అటువంటి వాటి కోసమే ఆన్లైన్ ద్వారా డబ్బుని పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఒంగోలులో యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేశారని ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని నగదు తీసుకోవాలని ఉద్యోగులకు కూడా వార్నింగ్ ఇస్తున్నామంటూ ప్రకటించారు ఈసీ ఎంకే మీనా. కాల్ డేటా రికార్డు బ్యాంక్ అకౌంట్ ద్వారా సస్పెండ్ చేస్తామనే విధంగా కూడా తెలియజేస్తున్నారు. తద్వారా ఉద్యోగులకు భారీ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో చాలామంది సైతం క్యాష్ ఇంటి దగ్గరికి వచ్చి మరి ఇచ్చేవారు ఇలాంటి సందర్భంలో చాలా పగడ్బందీగానే చేస్తూ ఉండేవారు పార్టీ నాయకులు.

ముఖ్యంగా ఒక పార్టీని మించి మరొక పార్టీ కూడా డబ్బులు పెంచి మరి ఇస్తూ ఉండేది.. ప్రస్తుతం ఎన్నికలు మొత్తం అటు అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీ మధ్యనే జరుగుతున్నాయి. మాటలు యుద్ధం కూడా తారస్థాయికి చేరిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఈ డబ్బు పంపిణీ పైన ఈసి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. మరో 5 రోజులలో ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో అటు పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: